తోటి మహిళా ఉద్యోగికి అసభ్య సందేశాలు, పంచాయతీ సెక్రటరికి దేహశుద్ది

ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్న ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలిలో చోటు చేసుకుంది.

కర్నూలు: ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్న ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలిలో చోటు చేసుకుంది.

సహోద్యోగిని పైనే అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సెల్‌ఫోన్‌ ద్వారా అసభ్యకర సందేశాలు పంపి ఆ ఉద్యోగిని చిత్రహింసలకు గురిచేశారు.

Woman employee harassed in Kurnool district

బాధితురాలు ద్వారా ఈ వేధింపుల విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న జనార్ధన్‌కు దేహశుద్ధి చేశారు.

మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగే సమావేశం సమయంలో కూడా ఏదో సాకుతో ఆమెతో అసభ్యకరంగా మాట్లాడేవాడని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌ ద్వారా తరచూ అసభ్యకర సందేశాలు పంపేవాడు.

ఈ సందేశాలు తన కాపురంలో ఎలాంటి చిచ్చు పెడతాయోనని మహిళా ఉద్యోగి తీవ్ర మనస్తాపం చెందేవారు. ఈ విషయాన్ని భర్తతో పాటు గ్రామస్థుల దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంలో ఉన్న కార్యదర్శి జనార్దన్‌ను బయటకు లాక్కొని వచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+