సహజీవనం చేసి నగ్న ఫోటోలు, వీడియోలు తీసిన కానిస్టేబుల్, అరెస్ట్
విజయవాడ: ఓ యువతిని లోబర్చుకొని, కొన్నేళ్లు సహజీవనం చేసి, ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె బందర్ కాల్వలో ఆత్మహత్యాయత్నం చేసింది.
పోలీసులు ఆమెను రక్షించి విషయం రాబట్టారు. దీంతో సదరు కానిస్టేబుల్ నిర్వాకం వెలుగు చూసింది. కృష్ణలంకలోని సత్యనారాయణ నగర్లో నివసిస్తున్న కుమార్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి మొగల్ రాజపురంలో నర్సుగా పని చేసే యువతితో చనువు ఏర్పడింది.
ఆ యువతితో మాటలు కలిపి ప్రేమిస్తున్నట్లు నమ్మబలికాడు. ఆమెతో సహజీవనం చేసాడు. హైదరాబాదు తీసుకు వెళ్లి ప్రయివేటు ఆసుపత్రిలో ఉద్యోగంలో చేర్పించాడు. ఓసారి గోవా తీసుకు వెళ్లాడు. అక్కడ తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు.

ఆమెతో ఏడేళ్ల పాటు సహజీవం చేశాడు. ఆ తర్వాత ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. తాను సహజీవనం చేసిన విషయం బయటకు చెబితే గోవాలో తీసిన ఫోటోలు, వీడియోలు నెట్లో పెడతానని బెదిరించాడు.
దీంతో బాధితురాలు జూలై 31వ తేదీన బందరు కాల్వలో దూకే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అక్కడున్న పోలీసులు ఆమెను రక్షించారు. అనంతరం కానిస్టేబుల్ కుమార్ మోసం చేశాడని గుర్తించి.. అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications