బాలకృష్ణ సినిమా డైలాగ్‌లకే పనికొస్తాడు: మహిళ నిప్పులు (వీడియో)
హిందూపురం: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పైన సొంత నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఉన్న వీడియో హల్‌చల్ చేస్తోంది. బాలకృష్ణ తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
ఆర్థిక పరిస్థితి బాగా లేదని తనలాంటి పేదలు ఎందరో హిందూపురం నియోజకవర్గంలో ఉన్నారని, వారిని బాలకృష్ణ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సినిమాలలో డైలాగులు చెప్పేందుకే బాలకృష్ణ పనికి వస్తాడని, పేదల గురించి పట్టించుకోడని ఆగ్రహించారు.
Video Credits: Mango News
నియోజవకర్గం సమస్యలు పట్టించుకోని బాలకృష్ణ పరమ వేస్ట్ అంటున్నారు. బాలకృష్ణ సినిమాల పైన దృష్టి పెడుతున్నారని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఆమె బాలకృష్ణ పైన మండిపడుతున్న వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ షాకింగ్ వీడియోను ఈ నెల 16వ తేదీన యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. కాగా, దీని పైన భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెతో బలవంతంగా అలా మాట్లాడించి ఉంటారనే కామెంట్లు కూడా పెడుతున్నారు. బాలకృష్ణ అందరికీ సహకరిస్తున్నారని ఆ కామెంటులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications