చీరతో చెట్టుకు కట్టేసి మహిళపై అత్యాచారం చేశారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమరనాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని వీవై కాలనీ సమీపంలో అత్యంత నీచమైన సంఘటన చోటుచేసుకుంది. చీరతో చెట్టుకు కట్టేసి ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఓ మహిళ(32) అక్కడి నెల్‌కాస్ట్ కంపెనీలో పనిచేస్తోంది. వినుకొండకు చెందిన కొంతమంది వ్యక్తులు అదే కంపెనీలో పని చేస్తున్నారు.
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన రామలింగయ్య అనే వ్యక్తి ఈ కంపెనీలోని వినుకొండకు చెందిన వారితో ఫోన్‌లో మాట్లాడే సమయంలో ఆ మహిళతో పరిచయమైంది. ఈ క్రమంలో తమ గ్రామానికి వస్తే సిద్ధాంతిగా పరిచయం చేస్తానని, క్షుద్ర పూజలు చేయగా వచ్చిన మొత్తాన్ని ఇరువురం పంచుకుందామని రామలింగయ్య ఆ మహిళకు చెప్పాడు. దీనికి అంగీకరించిన ఆ మహిళ మూడు నెలల క్రితం రామలింగయ్య వద్దకు వెళ్లింది.
ఇద్దరూ కలిసి మూగచింతలపాలెం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని నమ్మించారు. అతని భార్య అనారోగ్యంగా ఉండడంతో పూజలు చేస్తామని చెప్పి రూ. 12 వేలు వసూలు చేసిన ఆ మహిళ రామలింగయ్య వాటా ఇవ్వకుండానే గూడూరుకు వెళ్లి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది.

కాగా, రెండు నెలల తర్వాత మళ్లీ ఫోన్‌లో రామలింగయ్య ఆమెతో మాటలు కలిపాడు. మరో బేరం మాట్లాడానని పూజలు చేస్తే రూ.40 వేలు వస్తాయని నమ్మబలికాడు. ప్రకాశం జిల్లా కురిచేడులోని సుబ్యయ్య అనే మరో క్షుద్రపూజారి వద్దకు రావాలని ఆమెకు చెప్పాడు. దీంతో ఆ మహిళ శనివారం రాత్రి 7.30కు కురిచేడుకు వచ్చింది.
అదే సమయంలో రూ.12 వేలు తీసుకుని తన భార్యకు నయం చేయలేదంటూ వెంకటసుబ్బయ్య రామలింగయ్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకున్న మహిళను కలసి మాట్లాడతానని రామలింగయ్య, ఈయన సహాయకుడు ఎలీసాలతో కలసి వెంకట సుబ్బయ్య కూడా కురిచేడు వచ్చాడు. వీరంతా కురిచేడులో మహిళను బస్‌స్టాండు నుంచి శనివారం రాత్రి 7.30 సమయంలో క్షుద్రపూజారి ఇంటికి తీసుకొచ్చారు.
ఆ తర్వాత రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురూ ఆమెను పొలిమేర వద్దకు తీసుకెళ్లారు. రామలింగయ్య, వెంకటసుబ్బయ్యలు డబ్బుల విషయమై ఆ మహిళతో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఆమె చీరతోనే ఆమె కాళ్లూ, చేతులు కట్టేసి, చీర మరో భాగాన్ని చెట్టుకు కట్టి ఆమెపై అత్యాచారం చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications