బ్లేడుతో దాడి: టెక్కీ మాజీ ప్రియురాలి అరెస్టు

తన మాజీ ప్రియుడితో ఓ యువతి బ్లేడుతో దాడి చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో జరిగింది. మాజీ ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకున్నట్లు చెబుతున్నారు. మరీ ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడింది.
సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - రాజమండ్రికి చెందిన ప్రతాప్ (32) హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ బాచుపల్లిలో ఉంటున్నాడు. అతను అమలాపురానికి చెందిన రమ్యతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. ఇప్పుడు ఆమె చందానగర్‌లో ఉంటోంది.
గత మే నెలలో ప్రతాప్‌కు మరో యువతితో వివాహం నిశ్చయమైంది. అది తెలుసుకున్న యువతి తనను ప్రేమ పేరుతో మోసగించాడని అతనిపై కేసు పెట్టింది. పోలీసులు ప్రతాప్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను జూన్‌లో నిశ్సితార్థం చేసుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు.
దాంతో అతడిపై మాజీ ప్రియురాలు కక్ష పెంచుకుంది. బుధవారంనాడు అతని భార్య లేని సమయం చూసి అతని ఇంటికి వెళ్లింది. అతడిపై దాడి చేసి బ్లేడుతో మర్మాంగాలను కోసేందుకు ప్రయత్నించింది. దాంతో ప్రతాప్ అస్పత్రి పాలయ్యాడు.












Click it and Unblock the Notifications