శ్రీదేవి అని పేరు చెప్పండి, బయటకు వస్తారు: చిరంజీవి ఇంటి ఎదుట మహిళ హంగామా

హైదరాబాద్/రాజమహేంద్రవరం: కాంగ్రెస్ పార్టీ నేత, మెగాస్టార్ చిరంజీవి ఇంటి ఎదుట ఓ మహిళ హల్‌చల్ చేశారు. ఆయనను కలవాలంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఆమె హంగామా సృష్టించారు.

చివరకు ఆమె బంధువులు రావడంతో పోలీసులు ఆమెను వారి వెంట పంపించారు. చిరు నివాసం వద్ద హంగామా సృష్టించిన మహిళ పేరు శ్రీదేవి. ఆమె వయస్సు 40 ఏళ్ల వరకు ఉంటుంది. తనకు చిరంజీవి తెలుసునంటూ హంగామా చేశారు.

అర్ధరాత్రి చిరంజీవి ఇంటికి

అర్ధరాత్రి చిరంజీవి ఇంటికి

ఇందుకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిపారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 26లో ఉన్న చిరంజీవి ఇంటి వద్దకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి(40) వచ్చింది. ఉదయాన్నే చిరంజీవి ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ ఆమెను గుర్తించారు.ఇందుకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిపారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 26లో ఉన్న చిరంజీవి ఇంటి వద్దకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి(40) వచ్చింది. ఉదయాన్నే చిరంజీవి ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ ఆమెను గుర్తించారు.

నాపేరు చెప్పండి చిరంజీవి వస్తారు

నాపేరు చెప్పండి చిరంజీవి వస్తారు

మీకు ఎవరు కావాలని శ్రీదేవిని సెక్యూరిటీ సిబ్బంది అడిగారు. దానికి ఆమె తనకు చిరంజీవి బాగా తెలుసునని, శ్రీదేవి వచ్చింది అని చెప్పండి.. ఆయన వస్తారని వారితో చెప్పింది. ఓ సమయంలో వారిని దబాయించినట్లుగా కూడా తెలుస్తోంది. నేను చిరంజీవి కోసం వచ్చా, ఆయనను కలవాల్సిందేనని పట్టుబట్టింది.

అపాయింటుమెంట్ తీసుకోవాలని చెప్పగా

అపాయింటుమెంట్ తీసుకోవాలని చెప్పగా

చిరంజీవిని కలవాలంటే అపాయింటుమెంట్ తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు సూచించారు. ఉదయం రావాలని చెప్పారు. కానీ ఆమె ససేమీరా అన్నది. దీంతో వారు ఆమెకు సంబంధించి మిగతా వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఏం చెప్పకుండా.. నేను వచ్చానని చెబితే చాలని, చిరంజీవి గుర్తుపడతారని వారితో అన్నది.

ఒక్కసారి చూపించండి

ఒక్కసారి చూపించండి

చిరంజీవి తనను చూస్తే బయటకు వచ్చి పలకరిస్తారని, ఒక్కసారి చూపించాలని ఆమె పదేపదే సెక్యూరిటీ సిబ్బందిని అడిగింది. చూపించే వరకు ఇక్కడే కూర్చుంటానని వారికి తేల్చి చెప్పింది. ఆమె శనివారం ఉదయం పది గంటల వరకు అక్కడే ఉంది.

ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పంపించారు

ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పంపించారు

దీంతో వారు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాచుపల్లిలో ఉండే ఆమె సోదరికి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులతో హామీపత్రం రాయించుకొని శనివారం సాయంత్రం ఆమెను వారితో పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+