గల్ఫ్‌లో భర్త: ప్రియుడే చంపి, వివస్త్రను చేసి పడేశాడు

భారతి ముగ్గురు కుమారులతో ఇంటి వద్ేద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె ఉంటి పక్కనే కథలాపూర్ మండలం భూషణ్‌రావుపేటకు చెందిన రాజు తన కుటుంబంతో కిరాయికి ఉంటున్నాడు.
అడవిలో జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించడం అతని వృత్తి. పదిహేను రోజుల క్రితం భార్య లక్ష్మిని ఆపరేషన్ కోసం ఇంటికి పంపించాడు. ఈ సమయంలో భారతి, రాజు మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల భారతి భర్త గల్ఫ్ నుంచి లక్ష రూపాయలు పంపించాడు. శనివారంనాడు భారతి, రాజు ఇంట్లో కల్లుతాగి కోడిని కోసుకుని విందు చేసుకున్నారు.
మద్యం మత్తులో లక్ష రూపాయలు ఇవ్వాలని రాజు అడిగాడు. భారతి నిరాకరించింది. దీంతో అతను భారతిపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న ఏడు తులాల బంగారం ఆభరణాలను, ఇంట్లోని లక్ష రూపాయల నగదును తీసుకున్నాడు.
ఇంట్లో పడిన రక్తం మరకలను తుడిచేసి, ఇంటి వెనుక ద్వారం గుండా మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లిు, వివస్త్రను చేసి పడేసి పారిపోయాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాలకొండ రాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications