ప్రియుడిపై మోజు: అడ్డమని కూతురిని చంపిన మహిళ

హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో ఓ మహిళ కన్న కూతురినే కడతేర్చింది. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో తన ప్రియుడితో కలిసి నాలుగేళ్ల కన్నకూతురిని హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియుడితో వైవాహికేతర సంబంధానికి ఆటంకంగా ఉందనే అభిప్రాయంతో ఆ మహిళ కూతురిని పొట్టన పెట్టుకుంది.

చంద్రకళ అనే 21 ఏళ్ల మహిళ ఎనిమిదేళ్ల క్రితం వి. హనుమంత (40) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కూతురు కృష్ణవేణికి నాలుగేళ్లు. నల్లగొండ జిల్లా పెద్దవూరలో ఉండగా చంద్రకళకు 23 ఏళ్ల రమావత్ వెంకటితో సంబంధం ఏర్పడింది.

Woman, lover held for murder in Hyderabad

ఇటీవల హనుమంత నార్కెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. దాంతో వెంకటిని కలుసుకోవడం చంద్రకళకు ఇబ్బందిగా మారింది. కృష్ణవేణిని చంపేయాలని వెంకటి శుక్రవారంనాడు చంద్రకళకు చెప్పాడు. చంద్రకళ కూతురిని బయటకు తీసుకుని వెళ్లి చంపేసింది.

కూతురి గొంతు నులిమి చంపిన చంద్రకళ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది. చంద్రకళ నేరాన్ని అంగీకరించింది. ఆమెతో పాటు వెంకటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+