యువతి పట్ల అసభ్యంగా: రైల్వే స్టేషన్‌లో జననాంగంపై తాకి (వీడియో)
ముంబై పరిధిలోని చర్చ్ గేట్ రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
ముంబై: రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ అమ్మాయి పట్ల ఒక యువకుడు అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయికి అతి సమీపం నుంచి వెళ్తూ.. ఆమె జననాంగాలపై చేతితో తట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి యువతి హతాశయురాలైంది.
గట్టిగా అరుస్తూ అతని వెంటపడింది. ముంబై పరిధిలోని చర్చ్ గేట్ రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడిని మైనర్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టుకు పంపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications