అందం పెంచుకుందామని ఫేషియల్‌కు వెళితే: ముఖం కాలిపోయింది
అమరావతి: ముఖాన్ని మరింత అందంగా పెంచుకుందామని ఫేసియల్‌కు వెళ్లిన ఓ మహిళ ముఖమే పూర్తిగా మారిపోయింది. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది. గౌతమీనగర్‌లోని ‘సంధ్యాస్ బ్యూటీ పార్లర్' నిర్లక్ష్యం ఫలితంగా, ఆ మహిళ నెలరోజుల పాటు మానసిక క్షోభ అనుభవిస్తోంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీ (పేరు మార్చాం) అనే మహిళ మే 13న ‘సంధ్యాస్ బ్యూటీ పార్లర్'లో ఫేషియల్ చేయించుకొంది. బ్యూటీ పార్లర్ నిర్వహకురాలు సంధ్య, ‘మేరీగోల్డ్' ఫేషియల్ చేసి ఆవిరి పెట్టారు. ఆవిరి పెట్టిన సమయంలో ముఖమంతా మంటగా ఉండటంతో ఆవిరి అపమని చెప్పినా పట్టించుకోలేదు.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత లక్ష్మీ కుటుంబ సభ్యులతో ముస్సోరి వెళ్లింది. అక్కడ 24 గంటలైన తర్వాత ఆమె ముఖమంతా నల్లగా మాడిపోయింది. ఆ తర్వాత మూడు రోజులకు ముఖంపై చర్మం ఊడిపోయిందని బాధితురాలు పేర్కొంది. దీంతో ఆమె భర్త సాయంతో ముస్సోరిలోని వైద్యుల వద్దకు వెళ్లగా వారు తాత్కాలిక చికత్స చేశారు.

వారం రోజుల తర్వాత ముస్సోరి నుంచి తిరిగి వచ్చిన ఆమె బ్యూటీ క్లినిక్ నిర్వహకురాలు సంధ్యను కలిసి అసలు విషయం వివరించారు. ఎందుకిలా జరిగిందని ప్రశ్నించారు. ‘‘అందరికీ ఇలాగే చేస్తున్నాను... ఎవరికీ ఏమీకాలేదు... మీకే ఇలా అయ్యిందంటే మీ చర్మమే అందుకు కారణం'' అని సంధ్య సమాధానమిచ్చారు.
దీంతో బుధవారం ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యాసిడ్ అధికంగా వాడటం వల్ల ముఖం కాలిపోయినట్లు డీవీఎల్ విభాగాధిపతి డాక్టర్ నాగేశ్వరమ్మ నిర్ధారించారు. చికిత్స చేసి రెండు నెలల పాటు ఎండ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications