ఆకతాయి చెంపపై కొట్టిన యువతి, పెళ్లికి నో చెప్పిందని ఎత్తుకెళ్లారు..

హైదరాబాద్: తన వెంటపడుతున్న ఓ ఆకతాయి యువకుడి చెంప చెళ్లుమనిపించింది ఓ యువతి. పేట్ బషీరాబాద్ సమీపంలో ఓ యువకుడు అటుగా వెళ్తున్న యువతి వెంట పడ్డాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. తనకు పరిచయం లేని వ్యక్తి ఫోన్ నెంబర్ అడగడంతో ఆగ్రహించిన ఆ యువతి అతని చెంప చెళ్లుమనిపించింది.

విద్యార్థుల అదృశ్యం

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రెడ్డివారిపల్లెలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. రెండు రోజులుగా పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Woman slaps man in Hyderabad

పెళ్లికి నిరాకరించిందని యువతి అపహరణకు యత్నం

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లిలో ఓ యువతి అపహరణకు ప్రయత్నం జరిగింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిందని యువతిని తీసుకొని వరుడు, కుటుంబ సభ్యులు పరారయ్యే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించటంతో వారు యువతిని వదిలి పెట్టారు. అపహరణకు యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

దొంగల అరెస్ట్

రంగారెడ్డి జిల్లా ఉప్పల్లో పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుండి లక్షల విలువైన ఆభరణాలు, నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నంలో స్వైన్‌ ఫ్లూ కలకలం

విశాఖపట్నంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. కేజీహెచ్‌లో ఆస్పత్రిలో ఆరేళ్ల బాలుడు అభిరాం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మరో ఏడేళ్ల బాలిక స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతోంది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏడేళ్ల చిన్నారి తల్లి కూడా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+