షాకింగ్: ప్రశ్నించినందుకు మహిళను వివస్త్రను చేసిన దుండగులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. కబ్జాకోరులు రెచ్చిపోయారు. కబ్జాను ప్రశ్నించిన ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు లేదా డాక్యుమెంట్లు లేని భూములు, వివాదంలో ఉన్న భూములు ఉంటే వాటిపై కబ్జాకోరుల కన్ను పడుతోందని అంటున్నారు.

కీలక ప్రాంతాల్లో భూములు దక్కించుకోవాలని
కీలక ప్రాంతాల్లో భూములను దక్కించుకుంటే అనే ఉద్దేశ్యంతో రాత్రికి రాత్రి జెండా పాతిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండ కూడా ఉండటం వల్లే వారు రెచ్చిపోతున్నారని చెబుతున్నారు.

మహిళను వివస్త్రను చేయడంపై ఆగ్రహం
మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

న్యాయం కోసం అడిగితే రక్షణ లేదు
కాగా, భూకబ్జాను ప్రశ్నించి, వివస్త్రకు గురైన బాధితురాలు ఓ దళిత మహిళ అని తెలుస్తోంది. దీంతో దళిత సంఘాలు కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఊరూరా అంబేడ్కర్ విగ్రహాలు అంటున్నారని, కానీ న్యాయం కోసం అడిగితే రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు.

వివస్త్రను చేసింది
ఆ మహిళను వివస్త్రను చేసింది స్థానిక నాయకులు రాజు, శ్రీను అని ప్రచారం సాగుతోంది. కాగా తనపై జరిగిన అఘాయిత్యానికి బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications