ట్రయాంగిల్ లవ్: 3 ఏళ్ళు సహజీవనం, మరోకరితో లవ్, ప్రియుడికి ట్విస్ట్ ఇలా..
కర్నూల్: అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. తొలుత ఆ అబ్మాయి ప్రేమకు ఆ అమ్మాయి నో చెప్పింది. అమ్మాయిని తనను ప్రేమిస్తున్నానని చెప్పేవరకు ఆమె వెంట తిరిగాడు. ఆ అమ్మాయి కూడ ఓకె చెప్పడంతో కొంత కాలం పాటు ఆ అమ్మాయితో సహజీవనం చేశాడు. పెళ్ళి చేసుకోవాలని కోరడంతో మాట మార్చాడు. అంతేకాదు మరో యువతిని సన్నిహితంగా ఉంటూ ఆమెను వివాహం చేసుకొనేందుకు సిద్దమయ్యాడు. దీంతో బాధిత యువతి చెప్పుతో రోడ్డుపైనే కొట్టి యువకుడి బండారం బయటపెట్టింది. దీంతో బాధిత యువతిని ఆ యువకుడు వివాహం చేసుకొన్నాడు.ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.
సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన కర్నూల్ జిల్లాలో బుదవారం నాడు చోటు చేసుకొంది. ప్రేమించానని చెప్పి మోసం చేసిన యువకుడిని అడ్డొచ్చిన అతడి కుటుంబసభ్యులను బాధిత యువతి చెప్పుతో చితక్కొట్టింది.
ప్రేమించి మోసం చేశావంటూ ప్రియుడ్ని నిలదీసింది. కర్నూల్ జిల్లా పాణ్యం మండలం రామ్‌భూపాల్ రెడ్డి తండాకుచెందిన ఓ యువతిని నంద్యాల మండలం కానాలకు చెందిన చంద్రశేఖర్ ప్రేమించి మోసం చేశాడని బాధిత యువతి ఆరోపిస్తోంది.

ప్రేమించి మోసం చేశాడని యువతి ఆరోపణ
చంద్రశేఖర్ కొంత కాలం క్రితం ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు కానీ, ఆ ఆమ్మాయి అతడిని మాత్రం తొలుత ఆ యువకుడి ప్రేమను అంగీకరించలేదు. కానీ, ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయి చెప్పేవరకు ఆ యువకుడి ఆమె వెంటపడ్డాడు. ఎట్టకేలకు ఆ యువతి చంద్రశేఖర్‌కు ఒకే చెప్పింది. దీంతో చంద్రశేఖర్ కడపలో ఓ రూమ్ తీసుకొని సహజీవనం కూడ చేశారని బాధితురాలు చెబుతోంది. అయితే పెళ్ళి చేసుకోవాలని కోరితే ప్రియురాలికి దూరమయ్యాడు చంద్రశేఖర్.

మరో యువతితో చంద్రశేఖర్ సన్నిహితంగా ఉంటున్నాడు
పెళ్ళి చేసుకోవాలని యువతి డిమాండ్ చేయడంతో చంద్రశేఖర్ మరో యువతితో సన్నిహితంగా ఉండడం ప్రారంభించాడని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఈ విషయమై చంద్రశేఖర్‌ను నిలదీసింది. అతని నుండి సరైన సమాధానం లేదు. దీంతో చంద్రశేఖర్ తల్లిదండ్రులతో తేల్చుకోవాలని ఆ యువతి అక్కడికి వెళ్ళింది.

చంద్రశేఖర్‌తో వివాహం చేయాలని కోరిన యువతి
చంద్రశేఖర్‌తో తన వివాహం చేయాలని ఆ యువతి చంద్రశేఖర్ తల్లిదండ్రులను కోరింది. అయితే చంద్రశేఖర్ ససేమిరా అన్నాడు. అంతేకాదు చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కూడ మరో యువతితో చంద్రశేఖర్ వివాహం చేస్తామని చెప్పారు. యువతి చంద్రశేఖర్ కుటుంబసభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చంద్రశేఖర్‌పై చెప్పుతో దాడి
మరో యువతిని పెళ్ళి చేసుకొంటానని చంద్రశేఖర్ చెప్పడం, కుటుంబసభ్యులు కూడ అదే విషయాన్ని చెప్పడంతో బాధిత యువతి చంద్రశేఖర్‌ను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చెప్పుతో కొట్టింది. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై కూడ చెప్పుతో దాడికి దిగింది. పోలీసులకు కూడ ఫిర్యాదు చేసింది.

యువతినే పెళ్ళి చేసుకొన్న చంద్రశేఖర్
తాను ప్రేమించిన యువతినే వివాహం చేసుకొంటానని చంద్రశేఖర్ ఎట్టకేలకు ఒప్పుకొన్నాడు. దీంతో రెండు కుటుంబాల పెద్దలు చర్చించుకొన్నారు. స్థానికంగా ఉన్న గుడిలో చంద్రశేఖర్ ఆ యువతిని వివాహం చేసుకొన్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications