మీరా నీతులు చెప్పేది?: 'సగం మంది పోలీసులు మా వద్ద ఎన్నో రాత్రులు గడిపారు'

అనంతపురం: వ్యభిచార గృహంపై దాడి చేసిన మహిళా పోలీసులకు దానిని నిర్వహిస్తోన్న నిర్వహకురాలి మాటలు విస్తుపోయేలా చేశాయి. సగం మంది పోలీసులు మా వద్ద ఎన్నో రాత్రులు గడిపారు. అంతేకాదు మా నుంచి డబ్బులు కూడా వసూలు చేశారని నిర్వాహకురాలు చెప్పిన మాటలతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యారు.

వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని తేరుబజారులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. బండి గంగన్న భార్య బండి గీతాంజలి అలియాస్‌ సింధు పట్టణంలోని తేరుబజారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది.

జిల్లాకు చెందిన పలువురు యువతులను ఇక్కడకు రప్పించి వారిచేత వ్యభిచారం చేయిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తోంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేశారు.

Women arrested in prostitution case at ananthapuram

దీంతో అనంతపురం పట్టణ సీఐ హరినాథ్‌, ఎస్‌ఐలు గణేశ్‌, సునీతల ఆధ్వర్యంలో వ్యభిచారగృహంపై పోలీసులు సోమవారం దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఒక విటుడు, మరో యువతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, సింధుపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయని, తాజా దాడిలో మరో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గణేశ్‌ తెలిపారు.

దీంతో పాటు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానిపై సింధు దురుసుగా ప్రవరించదని ఫిర్యాదు కూడా అందింది. ఇల్లు ఖాళీ చేయమంటే రూ.10 లక్షలు ఇచ్చే వరకు ఖాళీ చేయనని బెదిరించిందని దీనిపై కూడా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. వ్యభిచార గృహం నిర్వహణపై ప్రశ్నించినందుకు స్థానికులను సైతం బెదిరించినట్టు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసిన సమయంలో పోలీసులపై సింధు తిరగబడింది. సగంమంది పోలీసులు మా వద్ద ఎన్నో రాత్రులు గడిపారు. అంతేకాదు డబ్బులు కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరొచ్చి మాకు నీతులు చెబుతున్నారు, అందరి గుట్టూ నా వద్ద ఉందంటూ ఒక్కొక్కరి పేర్లను చెప్పడానికి ప్రయత్నించగా ఎస్‌ఐలు ఆమె నోరు నొక్కి అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న అమ్మాయిలను, వివాహితలను గుర్తించి తమ మాయమాటలతో ఈ రొంపిలోకి దింపి వారిచే వ్యభిచారం చేయిస్తోందని సింధుపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కనగానపల్లి మండలానికి చెందిన ఓ యువతికి మాయమాటలు చెప్పి ఈ వృత్తిలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+