విద్యార్థినితో అసభ్యంగా టీచర్: లవర్ మోసం చేశాడని..

 Women beats teacher in Chittoor
చిత్తూరు: చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం ఎల్లంకివారిపాలెంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. ఉపాధ్యాయుడి పైన తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రియుడు మోసం చేశాడని..

తంబళ్లపల్లి మండలం బీ.కొత్తపేట పోలీసు స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు మోసం చేశాడని ఆమె బ్లేడుతో కోసుకుంది. యువతిని వెంటనే మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.

కిరోసిన్ పోసి తగులబెట్టారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ఓ వ్యక్తిని కిరోసిన్ పోసి హత్య చేశారు.

ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ఆందోళన

విజయనగరం జిల్లాలోని సీతానగరం వద్ద ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు రాళ్లు రువ్వడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పోలీసులు ఉన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. సుమారు రూ. 25 కోట్లు చెల్లించాల్సి ఉందని రైతులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా యాజమాన్యం చెల్లించలేదని రైతులు ఆరోపించారు.

జిల్లా అధికారులను ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేయవలసి వచ్చిందని రైతులు తెలిపారు. రైతులకు సమాధానం చెప్పేందుకు యాజమాన్యం తరఫున ఎవరూ రాలేదు. దీంతో మరింత ఆగ్రహించిన రైతులు యాజయాన్యం బకాయిలు చెల్లించేంతవరకు ఆందోళన ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు సర్ది చెప్పినా రైతులు వినలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు అత్యుత్సామం ప్రదర్శించడంతో రైతులు వారిపైకి రాల్లు రువ్వారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+