పేరుకు ఐఎఫ్ఎస్ ఆధికారి: లైంగిక వేధింపులు, కామపిశాచి ఆలోచనలు
అమరావతి: ఆయన పేరు శ్రీనివాసులు రెడ్డి. ఐఎఫ్ఎస్ అధికారి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా లైంగికంగా తృప్తి లేదన్న సాకుతో పలువురు మహిళలను వేధించడం మొదలుపెట్టాడు. అలా వేధింపులకు గురైన వారిలో ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం శ్రీనివాసులు రెడ్డి అనే ఐఎఫ్ఎస్ అధికారి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేశాడు. తన హోదాని చూపించి డబ్బులు కూడా వసూలు చేసేవాడు. పెద్ద అధికారి కావడంతో అతడిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల్ని నెల్లూరు రూరల్ పోలీసులు పట్టించుకోవడం లేదు.

మూడు పెళ్లిళ్లలో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇతగాడితో కాపురం చేయలేని ఆవిడ కూడా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ఓ పేదింటి అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే ఆయన సంతోషంగా లేడు.
దీంతో అతనికి ఓ దురాలోచన వచ్చింది. నెల్లూరులో ఉన్న దూరపు బంధువుల దగ్గరకు వెళ్లాడు. బంధుత్వం కలుపుకుని అక్కడ నుంచి ఇళ్లల్లో ఆడవాళ్లకి ఫోన్‌లు చేయడం, వేధించడం మొదలు పెట్టాడు. తననకు సహకరిస్తే చాలా లాభాలుంటాయని, అంతేకాకుండా బహుమతులి ఇస్తానని మభ్యపెట్టాలని చూసేవాడంట.
అందుకు అంగీకరించకపోతే వారి భర్తల్ని వివిధ కేసుల్లో ఇరికిస్తానని భయపెట్టేవాడంట. తనకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసంటూ బిల్డప్ ఇచ్చేవాడు. ఇలా అనేక మంది మహిళలు చాలా రోజుల పాటు అతని వేధింపులు భరించారు. ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభను అనుభవించారు.
చివరికి ఓ రోజు ధైర్యం చేసి, బంధువులంతా కలిసి నెల్లూరు రూరల్‌లో అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఒక్కసారి ఐఎఫ్‌ఎస్ శ్రీనివాసులు రెడ్డి ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తే తమను ఏవిధంగా వేధించేవాడో తెలుస్తుందంటున్నారు బాధిత మహిళలు. కేసు పెట్టడానికి వచ్చిన వారిపై తిరిగి మళ్లీ కేసులు పెట్టారు.












Click it and Unblock the Notifications