హాస్య నటుడు అలీ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా సంఘాలు

విశాఖపట్నం: ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ సినీ నటుడు అలీకి వ్యతిరేకంగా విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అలీ వచ్చాడు.

ఒక హోటల్‌లో దిగినట్టు తెలుసుకున్న మహిళా చేతన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అక్కడకు వెళ్లి ధర్నా చేశారు. అలీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ద్వంద్వార్థాలు వచ్చేలా అసభ్యకరంగా మాట్లాడుతూ వారిని అగౌరవపరుస్తున్నాడని ఆరోపించారు.

Women orgnisations express anguish at Ali comments

ఈ సందర్భంగా అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోగా అలీ ఫోన్‌ చేసి.. మహిళలకు క్షమాపణ చెప్పడంతో వారు శాంతించారు.

ఇటీవల హీరోయిన్ అనుష్కపై అలీ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. సైజ్ జీరో సినిమా కార్యక్రమంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+