బతుకమ్మ: అరుణ వర్సెస్ కల్వకుంట్ల కవిత (పిక్చర్స్)
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మహిళా నాయకులు ఎంగిలి బతుకమ్మ సంబరాల్లో హుషారుగా కనిపించారు. మహబూబ్‌నగర్‌లో పోటాపోటీగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో ఒకపక్క ప్రభుత్వం వేడుకలకు రూ. 5 లక్షలను విడుదల చేసి సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డికె అరుణ ఆధ్వర్యంలో జిల్లా స్టేడియం గ్రౌండ్‌లో ప్రభుత్వ పరంగా బంగారు బతుకమ్మ సంబరాలు జరిగాయి.
మరోపక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సైతం బంగారు బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలు తుకారం స్టేడియంలో జరిగాయి. పోటాపోటీగా నిర్వహించిన సంబరాలలో వేలాది మంది మహిళలు పాల్గొని బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటిస్తూ వీధులలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తా నుండి జాగృతి ఆధ్వర్యంలో ఊరేగింపు కొనసాగగా, మంత్రి డికె అరుణ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ నుండి బతుకమ్మ ర్యాలీ కొనసాగింది.
ప్రతిష్టాత్మకంగా ఇరువురు బతుకమ్మ వేడుకలను తీసుకోవడం, దాంతో మహిళలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేశారు. మంత్రి డికె అరుణ, కల్వకుంట్ల కవితలు బతుకమ్మలను ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాలలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
శుక్రవారం సచివాలయంలోని పోచమ్మ దేవాలయం వద్ద తెలంగాణ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఎంగిల బతుకమ్మ కార్యక్రమానికి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రాజనర్సింహ వచ్చి ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
'బతుకమ్మ పండుగ వచ్చింది.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది' అని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు. వచ్చే బతుకమ్మ పండుగను ప్రభుత్వం కేటాయించే నిధులతో చాలా గొప్పగా చేసుకుందామని తెలంగాణ ఆడపడుచులకు భరోసా ఇచ్చారు.

బతుకమ్మను ఎత్తుకున్న అరుణ
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల మంత్రి డికె అరుణ మహబూబ్‌నగర్‌లో బతుకమ్మను ఎత్తుకుని తెలంగాణ సంప్రదాయాన్ని చాటారు.

సామూహికంగా ఇలా...
బతుకమ్మ పండుగ మహిళ సామూహిక ఉత్సవం. మహిళలతో పాటు బతుకమ్మను ఎత్తుకుని డికె అరుణ ఇలా కనిపించారు.

ప్రభుత్వ వేడుక..
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగను ప్రభుత్వం కూడా నిర్వహిస్తోంది. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటైన ప్రభుత్వ కార్యక్రమంలో డికె అరుణ ప్రసంగించారు.

తోటి మహిళలతో చేతులు కలిపి..
తోటి మహిళలతో చేతులు కలిపి డికె అరుణ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడుతూ కనిపించారు.

సచివాలయంలో డిప్యూటీ సిఎం సతీమణి
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రాజనర్సింహ సచివాలయంలోని పోచమ్మ దేవాలయం వద్ద జరిగిన బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు.

తెలంగాణను తెచ్చింది...
'బతుకమ్మ పండుగ వచ్చింది.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది' అని పద్మినీ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఆమె బతుకమ్మ ఉత్సవాల్లో ఈ విధంగా అన్నారు.

బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో..
పద్మినీ రాజనర్సింహ ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తన ఆనందాన్ని ఆమె వ్యక్తం చేశారు.

కవిత పోటీ బతుకమ్మ
డికె అరుణ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ పండుగకు పోటీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహబూబ్‌నగర్‌లో బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేశారు.

కవిత మొదటి నుంచీ..
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణను దానికి ప్రతీకగా నిలిపేందుకు కవిత గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ యెత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు.

బతుకమ్మను ఎత్తుకున్న కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత బతుకమ్మను తలకెత్తుకుని వేడుకల్లో పాల్గొన్నారు.

గిరిజన మహిళలతో చేతులు..
బతుకమ్మ ఆటలో కల్వకుంట్ల కవిత గిరిజన మహిళలతో చేతులు కలిపారు. బతుకమ్మ ఆటను ఓ సంబరంగా నిర్వహించడంలో ఆమె పేరు తెచ్చుకున్నారు.

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ కల్వకుంట్ల కవిత ఇలా కనిపించారు.

అంబేడ్కర్‌కు నివాళి
మెదక్ జిల్లా గజ్వెల్‌లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత విమలక్క బాబా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

బతుకమ్మలతో విమలక్క
మెదక్ జిల్లా గజ్వెల్‌లో తెలంగాణ ఉద్యమ నేత విమలక్క, తన మహిళా సహచరులతో బతుకమ్మలతో ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications