హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముందు మహిళల ఆందోళన
జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటుచేయకూడదంటూ హిందూపురంలో మహిళలు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ఎదుట ఆందోళన చేశారు.
హిందూపురం: జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటుచేయకూడదంటూ హిందూపురంలో మహిళలు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ఎదుట ఆందోళన చేశారు.
జనావాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదంటూ మహిళలు హిందూపురంలో ఆందోళన నిర్వహించారు. పెనుకొండ రోడ్డుపై ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌జామైంది. అయితే పోలీసులు వారిని అక్కడినుండి బలవంతంగా పంపించారు.
Recommended Video

Balakrishna Facing Problems With his PA Shekhar

దీంతో మహిళలు నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి వెళ్ళి అక్కడ బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే పిఏ, టిడిపి నాయకులు బయటకు వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు.
చివరకు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి మద్యం దుకాణాన్ని మరోచోటకు మార్చేస్తామని చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications