టీడీపీని నిండా ముంచిన మహిళలు..?
జూన్ 4న వెలువడే ఫలితాలు కోసం రాష్ట్ర ప్రజలంతా అతృతుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈలోపు జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ని బహిరంగంగా ప్రకటించేందుకు సర్వే సంస్థలు రెడీ అవుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటకు రానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన రాజకీయ పార్టీల్లో చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. గతంలో మాదిరిగా సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో నెలకొన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది మహిళలని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. మహిళలు ఎక్కువగా ఎవరికి అండగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం వస్తోన్న నివేదికలు, సర్వే రిపోర్టుల ప్రకారం ఏపీలో మహిళలు అధిక స్థాయిలో వైసీపీకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఏపీలో 8.4 లక్షల మహిళల ఓట్లు కొత్తగా చేరాయి. వీరిలో మెజార్టీ మహిళలు వైసీపీకి మద్దతుగా నిలిచినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు సంక్షేమ పథకాలను నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్స్‌లో వేయడం వైసీపీకి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక వయో వృద్దులకు ఇంటికే ఫించన్ కార్యక్రమం విలువ ఏంటో గడిచిన రెండు నెలల్లో తెలియడంతో .. మెజార్టీ మహిళలు, వృద్దులు వైసీపీకి అండగా నిలిచినట్టు సమాచారం. దీంతో మహిళలందరూ జగన్‌కే ఓటు వేసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సంక్షేమ పథకాలు అందజేశాం కాబట్టి తమకే మహిళల ఓట్లన్నీ పడి ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. పోలింగ్ సరళిని ఓసారి గమనిస్తే..ఎన్నికల రోజు నాడు ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున మహిళలు, వృద్దులు క్యూలో నిలబడి ఓట్లు వేయడం జరిగింది. ఇదింతా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లని టీడీపీ నాయకులు చెబుతున్నప్పటికి..జగన్ ఇచ్చిన సంక్షేమం వల్ల లబ్దిపొందిన మహిళలు వైసీపీకి మద్దతుగా నిలవడంతోనే ఇంతటి భారీ స్థాయిలో ఓటింగ్ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ప్రీ పోల్ సర్వేలో కూడా ఇదే స్పష్టం అయింది. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీ గెలుపోటములను శాసించే స్థాయిలో మహిళలు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదనిపిస్తోంది. మరి మహిళలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.












Click it and Unblock the Notifications