Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రన్న పగ.. చంద్రన్న దగా: ఏపీలో అమలులో ఉన్న పథకాలు ఇవే

Roja: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఘాటు విమర్శలు సంధించారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Women s day Roja and Varudu Kalyani made key remarks against Chandrababu led Andhra Govt

ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించిన చంద్రబాబు- పవన్ కల్యాణ్ అధికారంలోకి రాగానే మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తోన్నారని, ఏ మాత్రం సంతోషంగా లేరని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు సాధారణం అయ్యాయని, వారంతా భయం, భయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసులను తీసుకు వచ్చారని, చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చంద్రబాబు, పవన్, హోంమంత్రి వంగలపూడి అనితకు మహిళలు అంటే కనీస గౌరవాభిమానాలు లేవని అన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగా, చంద్రన్న మోసం, తల్లికి పంగనామం, నిరుద్యోగులకు వెన్నుపోటు.. వంటి పథకాల పాలనను సాగుతోందని రోజా ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వం మహిళలకు మంచిని పంచేది కాదు, ముంచే ప్రభుత్వం అని విమర్శిస్తోన్నారని గుర్తు చేశారు.

కూటమ ప్రభుత్వానికి ఓట్లు వేసిన మహిళలకు కూడా చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఏ పనీ చేయట్లేదని మండిపడ్డారు రోజా. మహిళా సాధికారిత కోసం ఎంతో కృషి చేసినట్లు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంటోందని, రాష్ట్రంలో సగటున 70 మంది మహిళలు, వృద్దులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఇదేనా మహిళా సాధికారిత అంటే? అంటూ నిలదీశారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు. ఆరేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల మహిళ చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపుగా 50,000కు పైగా బెల్ట్ షాప్ లు పెట్టి, ఆడవారి పసుపు కుంకుమలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.

జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చి చంద్రబాబు- పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చారని, సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, వాటిని ఎగ్గొడుతున్నారని వరుదు కల్యాణి విమర్శించారు. ఈ ప్రభుత్వం మహిళలను నిలువునా నట్టేట ముంచిందని, మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదని గుర్తు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+