వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసvsకాంగ్రెస్ హంగ్ వస్తే టిలో కింగ్ మేకర్ మజ్లిస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ కింగ్ మేకర్ కానుందా? అంటే కావొచ్చుని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటులో మజ్లిస్ కీలక భూమిక పోషించే అవకాశం లేకపోలేదంటున్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మజ్లిస్‌తోపాటు ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే పరిస్థితి ఉండవచ్చని భావిస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.

తెలంగాణలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా అరవై మార్కును దాటాల్సిందే. కానీ, ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందనే అంశంపై విశ్లేషకులు పూర్తి భరోసాను వ్యక్తం చేయడం లేదు. ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న చిన్న పార్టీలపై ఆధారపడక తప్పక పోవచ్చని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో టిడిపి, బిజెపి 15 నుంచి 20 వరకు సీట్లు రావచ్చంటున్నారు. మజ్లిస్ కూడా ఆరేడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Asaduddin Owaisi

సిపిఐ, సిపిఎం వంటి వామపక్షాలు, వైయస్సార్ కాంగ్రెసు, స్వతంత్రులు మరో ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. టిడిపి, మజ్లిస్, ఇతర పార్టీలకు దాదాపు 30 సీట్లు వస్తాయని అంచనా భావిస్తున్నారు. మిగిలిన 90 సీట్లను కాంగ్రెస్, తెరాసలు పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకీ మేజిక్ మార్కయిన 60 సీట్లు వచ్చే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు.

అటువంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్‌కు అయినా అటు తెరాసకు అయినా ప్రభుత్వ ఏర్పాటుకు మజ్లిస్ లేదా ఇతర పార్టీల సహకారం తప్పనిసరి అంటున్నారు. తామే ఏర్పాటు చేస్తామని తెరాస, కాంగ్రెస్ బయటకు చెబుతున్నా లోపాయికారీగా మజ్లిస్ పార్టీతోసంప్రదింపులు జరుపుతున్నాయంటున్నారు.

English summary
With the MIM deciding to keep its option open about 
 
 supporting a party for the formation of the next 
 
 government in Telangana, both the Congress and the 
 
 Telangana Rashtra Samiti are taking its support for 
 
 granted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X