కోర్టు కేసు: సుజనా చౌదరి రాజ్యసభ సీటుకు ఎసరు?

హైదరాబాద్‌: మార్షియస్ బ్యాంక్ రుణం ఎగవేత కేసు కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి రాజ్యసభకు ఎసరు పెడుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆయన రాజ్యసభ సభ్వత్వం జూన్‌లో ముగియనుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ సీట్లకు మేలో ఎన్నికలు జరగనున్నాయి.

మార్షియస్ బ్యాంక్ అప్పుతో తనకు ఏ విధమైన సంబంధం లేదంటూనే ఆయన వ్యాపారంలో ఇటువంటి సహజమని అన్నారు. ఆ అప్పు తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తీసుకుంది కాదని ఆయన అన్నారు. ఆ రుణ వ్యవహారాన్ని కంపెనీ చూసుకుంటుందని అంటున్నారు.

అయితే, రుణం ఎగవేత కేసులో హైదరాబాదు నాంపల్లి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని ప్రత్యర్థులు కత్తులకు సానబెడుతున్నారు. పార్టీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు ఏ మాత్రం సుజనా చౌదరి అంటే గిట్టడం లేదని అంటున్నారు.

Would Court Case Spoil Rajya Sabha Chances of Sujana?

కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనను తిరిగి నామినేట్ చేయాలని చంద్రబాబు భావిస్తే నిర్మలా సీతారామన్‌ను కూడా నామినేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శాసనసభ్యుల సంఖ్యను బట్టి తెలుగుదేశం పార్టీ మూడు సీట్లను గెలుచుకోలుగుతుంది. అయితే, రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నవారు పార్టీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

నాలుగో సీటును కూడా గెలుచుకోవడానికి చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పెద్ద యెత్తున పార్టీలోకి లాగుతున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కంభంపాటి రామ్మోహన్, టిజి వెంకటేష్ సీట్లు ఆశిస్తున్నారు.

కాగా, కడప జిల్లా జమ్మలమడుగు ఇంచార్జీ రామసుబ్బారెడ్డికి చంద్రబాబు రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఆది నారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో ఆయనకు ఆ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అనివార్యతలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం కారణంగా, ముద్రగడ పద్మనాభం ఆందోళన కారణంగా చంద్రబాబు పడినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కోర్టు కేసు కారణంగా చూపి సుజనా చౌదరికి టికెట్ నిరాకరిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, సుజనా చౌదరి విషయానికి వస్తే చంద్రబాబు కోర్టు కేసులవంటి వాటిని ఏ మాత్రం పట్టించుకోరనే మాట కూడా వినిపిస్తోంది. బిజెపికి, టిడిపికి మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+