జగన్ స్వామిజీని కలవడం మంచిదే: యనమల కామెంట్, ఎందుకంటే?..
తాజాగా మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ స్వామీజీలను కలవడం, దీవెనలు పొందడం మంచిదేనన్నారు.అలాగైనా జగన్‌కు మంచి బుద్ధి వస్తుందని అన్నారు.
విశాఖపట్నం: దేశంలో ఎంతటి మహానేతైనా స్వామిజీల ముందు సాగిలపడటం చాలా ఏళ్లుగా కనిపిస్తున్నదే. నిన్న మొన్నటి దాకా ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నట్లే కనిపించిన జగన్ కూడా ఇప్పుడా జాబితాలో చేరిపోయారు.
పొలిటికల్‌గా పవర్ లోకి రావాలంటే స్వామీజీల చూపు కూడా తన మీద ఉండాలని భావించినట్లున్నాడు. ఈ క్రమంలోనే చిన్నజీయర్ స్వామిని కలుసుకోవడం ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగిపోయాయి. హిందూ సామాజిక వర్గంలో తన ఓటు బ్యాంకు పెంచుకునేందుకు జగన్ ఈ కొత్త వ్యూహాని తెరలేపారనేది కొంతమంది చేస్తున్న వాదన.

మరోవైపు యథావిధిగా టీడీపీ విమర్శలను ఎక్కుపెడుతూనే ఉంది. తాజాగా మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ స్వామీజీలను కలవడం, దీవెనలు పొందడం మంచిదేనని, అప్పుడైనా జగన్‌కు మంచి బుద్ధి వస్తుందని అన్నారు.
ప్రతీ ఒక్కరికి దైవబలం అవసరమని, జగన్ కూడా అందుకే స్వామిజీని కలిశారని చెప్పారు. ఇక కులాల గురించి ప్రస్తావిస్తూ.. మహానీయులకు కూడా ఆ గజ్జి అంటకడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల గురించి మాట్లాడే ముందు అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని యనమల సూచించారు.












Click it and Unblock the Notifications