యనమల X జ్యోతుల నెహ్రూ, బాబు హిట్లర్‌లా అని జగన్

హైదరాబాద్: సీఆర్డీఏ బిల్లు పైన శాసన సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల నేతలు వాగ్భాణాలు సంధించుకున్నారు. చంద్రబాబు ప్రపంచానికి పాఠాలు చెప్పారని ఎద్దేవా చేసిన జగన్‌కు ధీటుగా మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

చంద్రబాబు చాలామందికి పాఠాలు చెప్పారని, అనేక దేశాల్లో చెప్పారని, ఆయన రాజకీయ జీవితం 32 ఏళ్లు అన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఆయన నేర్చుకున్నారు, ఇతరులకు నేర్పారన్నారు. ఆయన చెప్పేవి ఎదుటి వాళ్లు అర్థం చేసుకునే వారని, కానీ మొండిపట్టుదల పట్టుకొని నాకు అర్థం కావడం లేదని అనే మీలాంటి వారకు చెప్పలేమన్నారు.

యాక్ట్ వేరు, రూల్స్ వేరు అన్నారు. చంద్రబాబు ఎంతోమందికి పాఠాలు చెప్పారని, నాకు అర్థం కావడం లేదని మీరు అంటుంటే అది మా దురదృష్టమన్నారు. మీకు ఒక్కరికే తెలుసు కాబట్టి రాష్ట్రంలోని ఆదాయం పోయి... అంటూ ఎద్దేవా చేశారు. జగన్‌కు అనుభవం లేకపోవడంతో రూల్స్ గురించి మాట్లాడుతున్నారన్నారు.

Yanamala counters YS Jagan

పక్కనున్న వాళ్లైనా అర్థం చేసుకుంటారనుకున్నా: యనమల

సీఆర్డీఏ పైన జగన్ అర్థం చేసుకోకపోయినా పక్కనున్న వారైనా అర్థం చేసుకుంటారనుకున్నానని, బిల్లు వచ్చాక, పాసయ్యాక రూల్స్ వస్తాయని క్లియర్‌గా ఉన్నాయన్నారు. నెహ్రూ కూడా చంద్రబాబు వద్ద పాఠాలు నేర్చుకొని వెళ్లారన్నారు. ఇప్పుడు అక్కడ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారన్నారు.

అన్నీ మీకే తెలుసని మాపై రుద్దకండి: జ్యోతుల నెహ్రూ

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా చంద్రబాబు దగ్గరే పాఠాలు నేర్చుకున్నారని అన్నారు. దీనిపై నెహ్రూ స్పందిస్తూ... ఇక్కడ ఎవరూ ఎవరి దగ్గరా పాఠాలు నేర్చుకోలేదని అన్నారు.

మనమంతా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన వారమన్నారు. అదృష్టం ఉన్నవాళ్లంతా పదవుల్లో కొనసాగుతూ ఉన్నతస్థాయిలో ఉన్నారని, దురదృష్టవంతులు ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారన్నారు. అంతా గొప్పోళ్లమన్న విషయం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆయన సూచించారు. మీవి మా పైన రుద్దవద్దన్నారు.

చదివితే బాగుండేది: దూళిపాళ్ల

ప్రతిపక్ష సభ్యులు సీఆర్డీఏను చదివితే బాగుండేదని, మొదట జగన్ 40 పేజీలు అన్నారని, పక్కనున్న వాళ్లు చెప్పాక 140 పేజీలు అన్నారని దూళిపాళ్ల ఎద్దేవా చేశారు. రీఅలాంట్మెంట్ వివరాలు చట్టం ప్రావిజెన్సులో ఉన్నాయన్నారు.

చట్టం తప్పని చెప్పడం సరికాదు: చంద్రబాబు

ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని, కానీ చట్టమే తప్పని చెబితే సరికాదని చంద్రబాబు అన్నారు. ల్యాండ్ పూలింగులో చట్టబద్ధత కోసం బిల్లులో వాటిని పెట్టామని చెప్పారు.

హిట్లర్ మాదిరిగా: జగన్

చంద్రబాబు చట్టం విషయంలో హిట్లర్ మాదిరిగా వెళ్తున్నారని జగన్ మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు సెటైర్లు

ఇప్పుడు జగన్ నైజమంతా అర్థమైందని, బిల్లు మీద పూర్తిగా అవగాహన లేకుండా సభలో మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. నీ అంత (జగన్) చదవకపోయినా మూడేళ్లలో ఎమ్మెల్యే అయి ఈ మధ్య చట్టాల గురించి తెలుసుకోవడంపై బాగా దృష్టి పెట్టానన్నారు. ప్రతిపక్ష నేతకు అవగాహన లేకపోవడం గంటన్నర టైం వృథా అయిందన్నారు. తమకు ట్రెయినింగ్ క్లాసులు ఇవ్వాలని, ముందు ప్రతిపక్ష నాయకుడికి ట్రెయినింగ్ ఇప్పించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+