రాజకీయ పార్టీల టీవీలు బురద జల్లినా పత్రిక స్వేచ్ఛేనా: యనమల
హైదరాబాద్: రాజకీయ పార్టీలకు అనుబంధంగా న్న టీవీ ఛానళ్లు మిగిలిన పార్టీల పైన బురద జల్లుతున్నా, రాజకీయ కుట్రలో భాగస్వాములుగా మారి వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ప్రశ్నించారు.
అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీల వ్యూహాలకు అనుగుణంగా పని చేస్తూ ఇతరుల పైన దుమ్మెత్తి పోసినా పత్రికా స్వేచ్ఛే అవుతుందా అని ఆయన నిలదీశారు. తెలగాణ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆఫీస్ పెట్టుకున్న టీ న్యూస్.. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పెద్ద కుట్రలో భాగస్వామిగా మారిందన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై హరీష్ రావు
శనివారం విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పైన ఓ విలేకరి ప్రశ్నించారు. ఏడాదిగా నిషేధం కొనసాగిస్తుండటం ఒప్పేనా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై హరీష్ రావు స్పందిస్తూ.. దానిని ఎవరు బ్యాన్ చేశారని అడిగారు.
సదరు విలేకరి మాట్లాడుతూ.. ఎంఎస్వోలు కావొచ్చు లేదా ఇంకెవరైనా కావొచ్చు కానీ సరైనదేనా అని అడిగారు. దాంతో హరీష్ రావు అది కోర్టు పరిధిలో ఉన్నదని సమాధానం దాటవేశారు. మీడియాను పది కిలోమీటర్ల అవతల పాతరేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయన అలా అనలేదన్నారు.
మరోవైపు, ఏబీఎన్ నిషేధం పైన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధి వేణుగోపాల చారి స్పందించారు. అందులో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయం లేదని, నేరుగా ఎక్కడా జోక్యం చేసుకోలేదని చెప్పడం గమనార్హం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిషేధంతో తమకు సంబంధం లేదన్నారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications