భారతి పేరు ఉండటాన్ని ఖండించలేదే? టీడీపీకేం సంబంధం?: జగన్‌కు యనమల కౌంటర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి పేరు ఈడీ ఛార్జీషీటులో రావడంపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు.
మంత్రి యనమల శనివారం మాట్లాడుతూ.. ఈడీ కేసు విషయంలో జగన్ వాదన విచిత్రంగా ఉందని అన్నారు. ఈడీ ఛార్జీ షీటు కేసులో కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అవినీతి చేయలేదని చెప్పలేని జగన్..
అవినీతి చేయలేదని చెప్పలేని జగన్.. వార్తలపై మాత్రం అభ్యంతరం ఎలా చెబుతారని మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ లేఖ ద్వారా ఆయన కుటుంబ ప్రమేయం ఉందని తేలిందన్నారు.

టీడీపీకేం సంబంధముంది?..
ఈడీ ఛార్జీ సీటు కేసులో టీడీపీకి సంబంధం ఏముంటుందని యనమల ప్రశ్నించారు. ఈడీ కేసు ద్వారా సానుభూతి పొందేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ టీడీపీని నిందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీలోని ఇద్దరు అధికారులు సహాయం చేశారనడం సరికాదన్నారు.

భారతి పేరు ఉండటాన్ని ఖండించలేదే?
జగన్ వైఖరితోనే ఆయన కుటుంబసభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈడీ కేసులో భారతీ పేరు ఉండటాన్ని జగన్ ఎక్కడా ఖండించలేదని అన్నారు. మీడియా లేనిది ఉన్నట్లుగా రాస్తే తప్పుపట్టాలి కానీ, ఉన్నది రాస్తే ఎందుకని ప్రశ్నించారు.

ఆమె పేరుందని జగన్ అడ్వకేట్లే..
ఈడీ కేసులో ఆమె పేరుందని జగన్ అడ్వకేట్లే చెబుతున్నారని అన్నారు.జగన్ మనీలాండరింగ్ కేసులో సీబీఐ కేసు నమోదైందని, ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని యనమల చెప్పారు. ఇప్పటికే రూ. 43వేల కోట్లను అటాచ్ కూడా చేశారని తెలిపారు.కోట్ల అటాచ్ మెంట్ కూడా అయ్యాయి.












Click it and Unblock the Notifications