వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటులో అందుకే స్టే: యనమల, బాబుపై భూమన సంచలనం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఊగిసలాడుతోందని, దీనికి సంబందించి కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు చెప్పారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో పాలనను ప్రారంభించారు.

పవన్ వద్ద ఫుల్‌స్టాప్: మోడీ కదలిక వెనుక 2 కారణాలు

ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలా లేక ప్యాకేజీ ఇవ్వాలా అన్ని దాని పైన కేంద్రం సమాలోచనలు జరుపుతోందన్నారు.

Yanamala responds on Special Status issue

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఆదాయం అనుకున్నంత రాకపోవడంతో రూ.3వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. నిధుల మంజూరుపై కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. రాష్ట్రంలో 19 సంస్థల్లో నిర్వహించిన లోకల్ ఆడిట్‌లో రూ.14,456 కోట్లకు సంబంధించి 33,37,034 ఆడిట్ అభ్యంతరాలు వచ్చినట్లు తెలిపారు.

చంద్రబాబుపై భూమన ఆగ్రహం

తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు చరిత్ర అంతా నేరమయమన్నారు. ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు.

అంతేకాని అందుకు విరుద్ధంగా శత్రువులుగా చూసే నైజం చంద్రబాబు మానుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ఉన్మాదిగా పోల్చడం సరికాదన్నారు. ప్రతిపక్షం పైన ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల పోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ప్యాకేజీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారని నిలదీశారు.

English summary
Minister Yanamala Ramakrishnudu on Friday responds on Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X