చూడాలి.. బడ్జెట్ స్పీచ్ వేరు, పొందుపర్చిన అంశాలు వేరు: యనమల ట్విస్ట్
అమరావతి: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. బడ్జెట్‌ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఏపీకి సంబంధించిన అంశాలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలుపై బడ్జెట్‌లో ఉందో లేదో చూడాలని చెప్పారు. కర్నాటక ఎన్నికల వల్లే బెంగళూరుకు మెట్రో అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు.

ప్రతి స్కీమ్ చదివితే చదివితే రాష్ట్రానికి ఏమి ఉన్నాయో, ఏం లేవో తెలుస్తుందని యనమల చెప్పారు. బడ్జెట్ స్పీచ్ వేరు, అందులో పొందుపర్చిన అంశాలు వేరని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ అన్నారు.












Click it and Unblock the Notifications