Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీలో 'సాక్షి': అనుమానమని యనమల, నేను అప్పుడు మంచివాణ్ణని జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, అధికార పార్టీ సభ్యుల మధ్య వాడిగావేడిగా చర్చ సాగింది. టీడీపీ - బీజేపీ నాటకం బాగుందని జగన్ ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటుగా స్పందించారు. జగన్ చిన్న వయస్సులోనే బాగా నటిస్తున్నారన్నారు. అంతపెద్ద నటకు అందరూ ఆశ్యర్చపోతున్నారన్నారు.

జగన్ నటన బెంగళూరు నుండే ప్రారంభమైందన్నారు. జగన్ బీజేపీ వద్దకు వెళ్లింది నిజమే కానీ ఎందుకు వెళ్లారనేది అందరికీ అనుమానమే అన్నారు. ఒకదాని కోసం వెల్లి మరో దాని పైన చెబుతున్నారని విమర్శించారు. ఆ రోజు బెయిల్ కావాలి కాబట్టి కాంగ్రెస్‌ను, ఇప్పుడు కేసుల నుండి విముక్తి కోసం బీజేపీని కలిసి ఉంటారన్నారు. ఇది తాను చెబుతోంది కాదని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రిని, ముప్పయ్యేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని పట్టుకొని మీడియా పిచ్చి అనడం సరికాదన్నారు. దానిని ఉపసంహరించుకోవాలన్నారు. అసలు మీడియా పిచ్చి జగన్‌కే ఉందన్నారు. ఎవరి డబ్బుతోని జగన్ సాక్షి పత్రిక, సాక్షి టీవీ పెట్టారని ప్రశ్నించారు. జగన్ ప్రెస్ ముందుకు రారని కానీ సాక్షి పత్రికలో, టీవీలో మాత్రం బ్రహ్మాండంగా వస్తుందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం గురించి తాము ఎప్పటికప్పుడు బీజేపీ దృష్టికి తీసుకు పోతున్నామన్నారు.

అర్జీలు తీసుకొని వెళ్తున్నా: జగన్

Yanamala versus YS Jagan in Assembly

తాను ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఆర్జీతో వెళ్తున్నానని జగన్ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చెబుతున్నానని చెప్పారు. ప్రతి సందర్భంలో మీడియాకు చూపిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ తన పైన ప్రతిసారి ఆరోపణలు చేయడమేమిటన్నారు.

తన పైన ఆరోపణలు చేసేందుకు.. కేంద్రమంత్రులతో, ప్రధాని మోడీతో మాట్లాడేప్పుడు టీడీపీ సభ్యులు వింటున్నారా అని ఎద్దేవా చేశారు. లేదా బీజేపీ నేతలు వారికి ఫోన్ చేసి నేను మాట్లాడింది చెబుతున్నారా అన్నారు. ఏపీని రాజకీయంగా భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎవరు వెళ్లినా అనుమానం రాదు కానీ: యనమల

ఢిల్లీకి ఎవరు వెళ్లినా అనుమానం రాదు కానీ జగన్ వెళ్తే అందరికి అనుమానమే అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే జగన్ నోరు మెదపలేదన్నారు.

బాబు మంచి ట్యూటర్: జగన్

ఒకే అబద్దాన్ని వందసార్లు ఎలా చెప్పాలో చంద్రబాబు టీడీపీ నేతలకు బాగా చెప్పారని జగన్ అన్నారు. ప్రజల్లో ఎలా అనుమానాలు రేకెత్తించాలో చంద్రబాబు బాగా శిక్షణ ఇచ్చారన్నారు. చంద్రబాబును మించిన గోబెల్స్ లేరన్నారు. ఇప్పటికైనా టీడీపీ తాము చేసిన తప్పులు పక్కన పెట్టి తాము చెప్పేది వినాలన్నారు.

దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ.. జగన్ మాటల్లోనే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఆయన పత్రిక మాత్రమే ఆయన గురించి బాగా రాస్తుందన్నారు. జఫ్తును కూడా ఘనమైనదిగా ప్రకటించే ప్రయత్నం విడ్డూరమన్నారు.

కేంద్రం కూడా ముంపు మండలాలను ప్రమాణ స్వీకారం చేసిన 16 గంటల్లోనే విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. లీగల్ హామీలను బీజేపీ అమలు పరుస్తుందన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆలస్యమైనా హామీలు నెరవేర్చుతామన్నారు. మోడీకి ఎలాంటి మచ్చ లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు.

జగన్ అప్పుడు మంచివాడే: జగన్

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జగన్ మంచివాడేనని, అంతకుముందు వైయస్ కూడా మంచివాడేనని కానీ కాంగ్రెస్ పార్టీని వీడాక తాను చెడ్డవాడినయ్యానని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీనే ఎదిరించానని, చంద్రబాబును ఎదిరించే దమ్ముందన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి తన పైన కేసులు వేయించారన్నారు. బీజేపీ అన్యాయం చేసిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని ధ్వజమెత్తారు. తమ పార్టీ సభ్యుడిని అవమానించేలా మాట్లాడవద్దని జ్యోతుల నెహ్రూ అధికార పార్టీకి సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+