తెలుగు భాష ఉత్తర్వులు పట్టవా
తెలుగు భాష ఉత్తర్వులు పట్టవా
న్యూఢిల్లీ:'తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కూడా అధికారులకు పట్టవా?' అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు . .. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా వేస్తున్న శిలాఫలకాలు తెలుగులోనే ఏర్పాటు చేస్తామని తెలుగు భాషా దినోత్సవం రోజున సీఎం హామీ ఇచ్చారని, ఉత్తర్వులు కూడా జారీచేశారని గుర్తు చేశారు ఇచ్చిన హామీని, పట్టించుకోకుండా విశాఖ జిల్లా అధికారులు నగరంలో రూపొందించిన పిల్లల ప్రాంగణానికి వుడా చిల్డ్రన్ ఎరీనాగా పేరు పెట్టడమే కాకుండా ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కూడా ఆంగ్లంలో ముద్రించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications