గన్నవరం వైసీపీలో కీలక మలుపు - వల్లభనేని వంశీ వాట్ నెక్స్ట్..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కొన్ని నియోజవర్గాలపై గురి పెట్టింది. వాటిల్లో ఖచ్చితంగా గెవాల్సిందేనని లక్ష్యంగా ఫిక్స్ చేసింది. అందులో గన్నవరం ప్రధాన వరుసలో ఉంది. వైసీపీ నుంచి ఈ సారి ఎన్నికల్లో వల్లభనేని వంశీ పోటీ చేస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయం సొంత పార్టీలోని వంశీ వ్యతిరేకులకు నచ్చ లేదు. ఈ క్రమంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

గన్నవరంలో కొత్త రాజకీయం : ఎన్నికల వేళ గన్నవరం రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. దాదాపు నాలుగేళ్ల కాలంగా వైసీపీ నేతగానే అక్కడ పని చేస్తున్నారు. 2014,2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన దుట్టా రామచంద్ర రావు, యార్లగడ్డ వెంకటరావు వల్లభనేని వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

yarlagadda Venkata Rao likely to join in TDP in presence of Lokesh soon, expecting TDP seat from Gannavaram

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది యార్లగడ్డ వెంకటరావు పై వంశీ 990 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వంశీ కారణంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు పడిన తాము ఇప్పుడు కలిసి పని చేసేది లేదని దుట్టా, యార్లగడ్డ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ వర్గాల మధ్య అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

టీడీపీ వైపు యార్లగడ్డ చూపు : దుట్టా, యార్లగడ్డ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వల్లభనేని వంశీని ఇప్పటికే వైసీపీ గన్నవరం అభ్యర్ధిగా ఖరారు చేసారు. దీంతో, గన్నవరం వైసీపీ నేతల మధ్య విభేదాలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. యార్లగడ్డ వెంకటరావు టీడీపీతో టచ్ లో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.

కొద్ది రోజుల క్రితం యార్లగడ్డ ఈ ప్రచారం ఖండించారు. ఇప్పుడు యార్లగడ్డ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం తన ముఖ్య అనుచరులతో యార్లగడ్డ వెంకటరావు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే లోకేశ్ కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. దీని పైన వెంకటరావు ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

yarlagadda Venkata Rao likely to join in TDP in presence of Lokesh soon, expecting TDP seat from Gannavaram

వంశీకి కలిసొచ్చేనా : ఇప్పుడు వెంకటరావు పార్టీ వీడటం ద్వారా గన్నవరం లో చోటు చేసుకొనే పరిణామాలపైన వైసీపీ ఆరా తీస్తోంది. వైసీపీ మద్దతు దారులు వెంకటరావు వెనుక వెళ్లే అవకాశం ఉందా అనే కోణంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం.

ఆ రెండు స్థానాల్లో తమ ఖాతాలో జమ కావాలనేది వైసీపీ వ్యూహం. ఇప్పుడు యార్లగడ్డ పార్టీని వీడితే నియోకవర్గంలో ఎటువంటి ప్రభావం పడుతుందనేది ఆసక్తిగా మారుతోంది. యార్లగడ్డ టీడీపీలో చేరినా సీటు విషయంలో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సమయంలో వెంకట్రావు తీసుకొనే నిర్ణయం..పర్యవసానాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+