ఏపీలో జగన్ సునామి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా సోమవారంనాడు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల రోజులుగా రాజకీయ పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ, అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమాను మొదటి నుంచి జగన్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.దీనికి అనుగుణంగానే ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసి దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలు రూపొందించారు.
మరోవైపు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయడం తమకు కలిసి వస్తుందని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ శాతం 68.09 జరిగినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నేతల్లో కూడా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అని ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ నాడు సోషల్ మీడియాలో అధికార వైసీపీ హల్ చల్ చేస్తోంది.

ట్విట్టర్‌లో జగన్ సునామి అనే ట్యాగ్‌ను వైసీపీ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేది తామే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ..జగన్ సునామి అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. జగన్ మరోమారు సీఎం కావడం ఖాయమని అధికార పార్టీ చెబుతోంది. గ్రామాల్లో ఓటింగ్ సరళిని చూస్తూంటే తిరిగి వైసీపీనే అధికారంలోకి వచ్చేలా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున జగన్ సునామి అనే ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు.












Click it and Unblock the Notifications