ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? అందుకే నియోజకవర్గం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ సీనియర్ నేతలను మొహరించిందా? ప్రతి గ్రామానికి, మండలానికి ఇన్ఛార్జిలను కూడా నియమించడానికి కారణం.. ఓటమి భయమేనా? అనే ప్రశ్నలకు భారతీయ జనతాపార్టీ నేతలు ఔనంటున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, పార్టీ నేత సీఎం రమేష్ ఆత్మకూరు బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ఆత్మకూరు అని సత్యకుమార్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రితో ప్రచారం చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత భయం ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేసి ప్రజల్లోకి వెళ్లవచ్చుకదా అన్నారు.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులు ఎదుర్కొన్న ఇక్కట్లు ఏ ప్రభుత్వంలోను ఎదుర్కోలేదన్నారు. లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, రివర్స్ టెండరింగ్ మాపియా... ఇలా అన్ని మాఫియాలతో వైసీపీ ప్రభుత్వమే ఓ మాఫియా ప్రభుత్వమని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్ అయితే గోల్ మాల్ చేయడానికి వీలుండదని, అందుకే నగదు లావాదేవీలు జరుపుతున్నారన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications