Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతిలో ఇది పరిస్థితి.. లోకల్, నాన్ లోకల్.. బ్రాండ్ ముఖ్యం బాబు.. వైసీపీ, జనసేన, టీడీపీలో!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మూడు పార్టీలు ఒక్కటి కావడంతో పలు నియోజక వర్గాల్లో టిక్కెట్ల దక్కని నాయకులు పార్టీలు మారుతున్నారు.

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ కింద ఉన్న తిరుపతిలో మామూలుగానే ఎండలు, వేడి విపరీతంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడంతో ఆ ప్రాంతంలో వేడి ఎక్కువ కావడంతో ఆ ప్రాంతంలోని నాయకులు ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా వైసీపీ లోకల్, నాన్ లోకల్ నినాదంతో ప్రజల్లో వెళ్లి ఎలాగైనా విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నారు.

YCP and Jana Sena leaders entered the field with the slogan of local non local in Tirupati

తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఇప్పుడు ఆ నియోజక వర్గం వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో, టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి విజయం కోసం పావులు కదుపుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే సీటు కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టిక్కెట్ దక్కకపోవడంతో ఒకరకంగా ఆమె సైలెంట్ అయిపోయారు.

తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జంగాలపల్లె శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అయిన జంగాలపల్లె శ్రీనివాసులకు మరోసారి టిక్కెట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరాకరించడంతో ఆయన వైసీపీ మీద తిరుగుబాటు చేశారు. అయితే వైఎస్ జగన్ మాత్రం వైసీపీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో వైసీపీ ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

YCP and Jana Sena leaders entered the field with the slogan of local non local in Tirupati

రాజకీయ అనుభవం ఉన్న జంగాలపల్లె శ్రీనివాసులు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన టిక్కెట్ పై తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జంగాలపల్లె శ్రీనివాసులు నాన్ లోకల్ అని ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే తాను పక్కనే ఉన్న చిత్తూరు నుంచి వచ్చానని, తనకు చిత్తూరు, తిరుపతి రెండు కళ్లులాంటివి అంటూ జంగాలపల్లె శ్రీనివాసులు స్థానికులకు చెబుతున్నారు.

ఇక తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడ అభినయ్ రెడ్డి గెలుపు కోసం పగలు, రాత్రి అని తేడాలేకుండా కష్టపడి పని చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నాన్ లోకల్ అనే ఒక చిన్న విషయం పక్కనపెట్టి జంగాలపల్లె శ్రీనివాసులకు పూర్తిగా సహకరిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని స్థానికులు అంటున్నారు. తిరుపతిలోని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో చర్చలు జరిపిన జంగాలపల్లె శ్రీనివాసులు తనకు మద్దతు ఇవ్వాలని మనవి చేశారు. ఇదే సమయంలో తిరుపతి కాపు (బలిజ) సంఘం నాయకులతో జంగాలపల్లె శ్రీనివాసులు ఇప్పటికే చర్చలు జరిపి తనను ఆదరించాలని మనవి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+