ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చే దమ్ముందా..? టీడీపీకి వైసీపీ సవాల్
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమి నేతలకు పట్టం కట్టారు. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చిన టీడీపీ గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు మార్చాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా వైసీపీ ప్రభుత్వం మార్చించి. ఇక ఇదే సమయంలో వైజాగ్‌లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు ఉన్న పేరును సైతం మార్చడం జరిగింది.
ఈ రెండింటికి కూడా దివంగత నేత వైఎస్ఆర్ పేరును పెట్టారు. అప్పట్లోనే ఈ రెండు పేర్లు మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం.. కూటమి అధికారంలోకి రావడంతో తిరిగి వాటి పేర్లను యథాస్థితిలో పెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే టీడీపీ విజయం సాధించగానే టీడీపీ నేతలు విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుగా మార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక వైజాగ్‌లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు తిరిగి ఆ పేరునే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రెండు పేర్లను మార్చడంపై వైసీపీ రియాక్ట్ అయింది. ఆ పార్టీ నేత , మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దీనిపై మాట్లాడుతూ..తాము పెట్టిన పేర్లను తొలగించిన టీడీపీ నేతలకు దమ్ముంటే ఎన్టీఆర్ జిల్లా పేరును కూడా మార్చాలంటూ సవాల్ విసిరారు. ఉమ్మడి కృష్ణాజిల్లాను రెండుగా విభజించి ఒకదానికి ఎన్టీఆర్ జిల్లాగా నామాకరణం చేశారు. ఇప్పుడు దమ్ముంటే ఆ పేరును మార్చాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications