చంద్రబాబు, భువనేశ్వరి కోడ్ ఉల్లంఘన - సీఈఓ కి వైసీపీ ఫిర్యాదు..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుంది. విశాఖలో సిబిఐ పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం గా మారుతుంది. ఇందులో వైసీపీ నేతలే ఉన్నారంటూ టిడిపి విమర్శలు గుప్పిస్తుంది. దీనికి వైసిపి నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైనే వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పై విచారణ జరపాలని వైసిపి నేత పేర్ని నాని డిమాండ్ చేశారు. విశాఖ డ్రగ్ వ్యవహారంలో చంద్రబాబు,లోకేష్,పురందేశ్వరి, టిడిపి ముఖ్యుల పాత్రపై సీఈఓ కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టిడిపి నేతలు ఈ డ్రగ్స్ తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వైసిపి పై చేసిన ట్వీట్ ను తమ ఫిర్యాదులో జత చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోతుగా విచారణ జరపాలని అభ్యర్థించారు.

YCP complains on tdp over negative campain against them in vizag drugs seize episode to election CEO

సిబిఐ 25 వేల కిలోల మత్తు పదార్థాలను పట్టుకుందని, ఇందులో లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలియకుండానే చంద్రబాబు తమ పార్టీపై విషయం చెప్పారని నాని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి బంధువులే డ్రగ్సు వ్యవహారంలో ఉన్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అమరావతికి సింగపూర్ మంత్రిని తెచ్చారని ఆ మంత్రి సింగపూర్ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారి పోతారని విమర్శించారు. కోడు ఉన్న సమయంలో నిరాధార ఆరోపణలు చేయడం కూడా ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్ని నాని వివరించారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ముల్లంగించారని ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి కోడ్ ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము ఇప్పటికే ఈ అంశంపై సమాచారం సేకరిస్తున్నామని తగిన విధంగా స్పందిస్తామని సీఈవో వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+