వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందే కూస్తున్న వైసీపి కోయిల..! ఫలితాలు ఇంకా రానేలేదు..! బాబు పై విచారణకు ఆదేశిస్తామంటున్న బొత్స..!!

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్ : చంద్రబాబు మాయల మరాఠీ, ఈవీఎంల భద్రతను కట్టుదిట్టం చేయ్యాలి అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మాటలు విడ్డురం గా ఉన్నాయని, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు ముఖ్యమంత్రి చంద్రబాబు హయం లో జరిగిన అవినీతి వివరించారని, అజయ్ కల్లం కూడా అవినీతి గురించి చెప్పారని వైసీపి నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఉన్నతాధికారులు మద్దతు ఇవ్వాలని చెప్పడం దారుణమన్నారు. క్యాబినెట్ లో పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారని, బాబు అందుకు విరిద్దంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

ycp early comments.!no results so far.!will enquire on babu says botsa..!!

ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి డబ్బు సరఫరా చేసిన వారికి ఇప్పుడు అడ్డగోలుగా కేటాయింపులు చేస్తున్నారని బొత్స తెలిపారు. అధికారులు అడ్డగోలుగా టీడీపీ ప్రభుత్వానికి సహకరించొద్దని, బడ్జెట్ కేటాయింపులు లేకుండా నిధులు విడుదల చేశారని ఘాటుగా విమర్శించారు. ఒక్క సామజిక వర్గానికే కాంట్రాక్టు లు, భుములు కేటాయింస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించారని, ఇప్పటికే ఎన్నికల సంఘం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వ్యవస్థ లను నాశనం చేసే టీడీపీ, చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఇలానే ఉంటుందని, తాము ముందు నుంచి చెబుతున్నట్టు ఓటుకు 2వేలు ఇస్తారని, ఆలాగే కొన్నారని ఆయన అన్నారు. వైసీపి అదికారంలోకి వస్తే వీటన్నిటిపై విచారణ ఉంటుందని బొత్స తెలిపారు.

English summary
The election rules were violated and the complaint was already filed by the Election Commission, ycp senior leader said that as long as people like TDP and Chandrababu are destroying the system, it would be similar to that, they said they were giving 2thousand rupees for single vote.If the yCP comes into power, there will be a trial on them, botsa said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X