జగన్‌కు షాక్..జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు

వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి.గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరి కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు,ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కొందరు కీలక నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి వంటి నేతలు జనసేన గూటికి చేరారు.

YCP Key leaders joined Janasena

సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు పవన్‌ కల్యాణ్‌. కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఈ మధ్యే వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, శ్రీమతి రాధని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్‌ కల్యాణ్‌. గతంలో ఆయన టీడీపీలో పని చేశారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ఒకనొక దశలో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి వైసీపీ తరుఫున పోటీ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ జగన్ మరొకరికి టికెట్ కేటాయించడం, పార్టీ ఓడిపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+