బోరుగడ్డ అనిల్ కు బందరు లడ్డూ తినిపించిన పోలీసులు, అందుకే !!
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ మాస్ లీడర్ గా, వైసీపీలోని కొందరు సీనియర్ నాయకుల అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరుగడ్డ అనిల్ అలియాస్ అనిల్ పోలీసుల విచారణలో కీలక సమాచారం బయట పెట్టాడని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ పై పోలీసులు దృష్టి సారించికపోవడంతో అతని ఆగడాలు, అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని అతని బాధితులు అంటున్నారు.
ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటకు లాగుతున్నారని తెలిసింది. పోలీసు కస్టడీలో బోరుగడ్డ అనిల్ కీలక సమాచారం చెప్పాడని తెలిసింది. గతంలో గుంటూరులోని అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చర్చి వివాదంలో తల దూర్చిన బోరుగడ్డ అనిల్ ఆ చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబా బాబును బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వలేదంటే నిన్ను ఈ చర్చిలో లేకుండా చేస్తామని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.

చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబు ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్, అతని అనుచరుడు పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న బోరుగడ్డ అనిల్ ఇంతకాలం అతన్ని కాపాడుకుంటూ వచ్చిన కొందరు వైసీపీ నాయకును కలిసి తనను రక్షించాలని వేడుకున్నాడు. అయితే ఏ వైసీపీ నాయకుడు కూడా బోరుగడ్డ అనిల్ కు సహాయం చేయడానికి ముందుకు రాలేదని తెలిసింది.
చివరికి పోలీసులు ఈనెల 17వ తేదీన బోరుగడ్డ అనిల్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో బోరుగడ్డ సెల్ ఫోను, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ తో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను బోరుగడ్డ అనిల్ నోటికి వచ్చినట్లు దూషించాడు. అన్ని పార్టీల నాయకులను బూతులు తిట్టిన బోరుగడ్డ అనిల్ పైన పోలీసులు కూడా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు.

అయితే ఈ కేసులో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ కావడంతో అతనికి ఇంతకాలం అండగా ఉన్న వైసీపీ నాయకులు హడలిపోయారని సమాచారం. బోరుగడ్డ అనిల్ కు ఇంతకాలం సహాయ సహకారాలు అందించిన వైసీపీ నాయకులు వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. బోరుగడ్డ అనిల్ కు ఇంతకాలం ఎవరు ఆశ్రయం ఇచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బోరుగడ్డ అనిల్ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి అతని మీద ఫిర్యాదులు చేస్తే బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications