టీడీపీ గెలుస్తుందని పందెం కట్టిన వైసీపీ నేత
ఏపీలో ఈ నెల 13 ఎన్నికలు జరగ్గా.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలు గా ఉన్న టీడీపీ, జనసేన , బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల కళ్లన్నీకూడా ఎగ్జిట్ పోల్స్‌పై పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయో అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తుది దశ పోలింగ్ ముగియగానే అంటే శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక పందెం రాయుళ్లకు ఈ ఎన్నికలు పండగలా మారాయి. ఐపీఎల్ ముగియడంతో ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అని భారీ ఎత్తున బెట్టింగ్ రాయుళ్లు పందెలు కాస్తున్నారు. ఒక్క ఏపీలోనే 2000 వేల కోట్ల వరకు పందెలు జరిగినట్టు సమాచారం.

తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదిరిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పందెం వేశారు. మరొకరేమో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఏకంగా రూ.10 లక్షలు పందెం వేయడం విశేషం. అయితే వైసీపీకి చెందిన నేత ఒకరు కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వైసీపీ నేత పేరు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications