ఆన్ లైన్ లో బుకింగ్, ఆ జిల్లాలో ఇప్పుడు కూడా వైసీపీ హవా !

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇసుకను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఇసుకను అక్రమంగా అనుకుంటున్నారని మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు అదే టీడీపీ నాయకులు ఇసుకను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఉచిత ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మన పార్టీ నాయకులు ఇసుక విషయంలో జోక్యం చేసుకోరాదని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులను, పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.

YCP leaders are booking sand online and selling it in the black market

కొన్ని జిల్లాలలో టీడీపీ నాయకులు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, మద్యం వ్యాపారంలో టీడీపీ నాయకులు ఎవ్వరూ జోక్యం చేసుకోరాదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇసుక, మద్యం వ్యాపారం విషయంలో మన పార్టీ నాయకులు దూరంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా జనసేన నాయకులను హెచ్చరించారు.

అధికార పార్టీలో ఉన్న నాయకులు ఇలా చేశారంటే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. వైసీపీ నాయకులు గతంలో గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల నెంబర్లతో ప్రస్తుతం ఇసుక ఆన్ లైన్ లో బుకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలోని అనేక ఇసుక రీచ్ లలో ఇసుక బుక్ చేసుకుంటున్నది వైసీపీ నాయకుల వాహనాలు అని వెలుగు చూసింది.

YCP leaders are booking sand online and selling it in the black market

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గనుల శాఖలో 10 చక్రాల వాహనాలు, 12 చక్రాల వాహనాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సందర్భంలో బుక్ అయిన వాహనాలకు ఇప్పుడు మళ్లీ ఆన్ లైన్ లో ఇసుక బుక్ అవుతుందని వెలుగు చూసింది. ఆన్ లైన్ లో ఇసుక తీసుకొని బ్లాక్ లో అమ్ముకుంటున్నారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+