మంత్రి రోజాకు అగ్నిపరీక్ష, జగన్ సభ సక్సస్ అయితేనే, లేదంటే ?, డేట్, రోడ్ షో ఫిక్స్ !
తిరుపతి/నగరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగరి పర్యటన విజయవంతం చెయ్యాలని ఆ రాష్ట్ర మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు సీఎం జగన్ నగరి పర్యటనను విజయవంతం చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనెల 28వ తేదీ సోమవారం సీఎం వైఎస్ జగన్ నగరి పర్యటనకు వస్తున్న సందర్బంగా సంబంధిత అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం జగన్ బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించడానికి ఆ పార్టీకి చెందిన నాయకులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా కూడా కార్యకర్తల సమీకరణ కోసం తన అనుచరులను రంగంలోకి దింపారు.

నగరి పట్టణ శివార్లలోని సాయిదివ్యధామంలో సీఎం జగన్ బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరి పట్టణ సమీపంలోని కీళ్లపట్టు వద్ద హెలిపాడ్ సిద్దం చేశారు. కీళ్లపట్టు హెలిపాడ్ నుంచి సీఎం జగన్ రోడ్ షో నిర్వహించి నగరి పట్టణంలోని పళ్లిపట్టు రోడ్డు, ప్రకాశం రోడ్డు మీదుగా నగరి బైపాస్ రోడ్డు మీద జగన్ రోడ్డు బహిరంగ సభకు చేరుకునేలా వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం జగన్ దిగనున్న హెలిపాడ్ నుంచి రోడ్ షో జరిగే రోడ్లు, బహిరంగ సభ జరిగే ప్రాంతం వరకు రోడ్లకు ఇరు వైపుల పోలీసులు భారీ ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నగరిలో జరిగనున్న సీఎం జగన్ బహిరంగ సభకు వైస్ సీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు అంచనావేస్తున్నారు.

సీఎం జగన్ భారీ బహిరంగ సభ జరిగే ప్రాంతంలో అత్యవసర వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలకు మంచినీళ్లు, ఆహార పొట్లాలు అందుబాటులో ఉండటానికి నగరి వైసీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ నియోజక వర్గంలో సీఎం జగన్ మొదటిసారి పర్యటిస్తున్నారు.
సీఎం జగన్ బహిరంగ సభను విజయవంతం చేసి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని మంత్రి రోజా, నగరి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని తెలిసింది.. అయితే సీఎం నగరి పర్యటన విజయవంతం కావడానికి చిత్తూరు, తిరుపతి, అన్నయయ్య, సత్యసాయి జిల్లాల వైసీపీ నాయకులు ఎంత వరకు సహకరిస్తారో అనే విషషంపై వేచి చూడాలని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. ఆదివారం సెలవు అనే విషయం పక్కన పెట్టిన అధికారులు, పోలీసులు సీఎం జగన్ పర్యటనకు భారీ ఎత్తున ఏర్పాట్లు, గట్టిబందోబస్తు చేస్తున్నారు
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications