పెద్దిరెడ్డి అడ్డాలో నందమూరి ఎంట్రీ, వైసీపీ లీడర్స్ జంప్ జిలాని, పోలింగ్ ముందు పగిలింది !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకండా చెయ్యాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని, జెండాలు వేరు అయినా అజెండా మాత్రం ఒక్కటే అని నందమూరి రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, ఆయన సహచరుల ఆగడాలు ఎక్కువ అయ్యాయని, వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం ఎదురు చూస్తున్నారని నందమూరి రామకృష్ణ చెప్పారు.
చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె, అరగొండ ప్రాంతంల్లో వైసీపీకి బలమైన నాయకులు ఉన్నారు. అయితే నందమూరి రామకృష్ణ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్రాంతంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. తవణంపల్లె, అరగొండకు చెందిన వైసీపీ నాయకులు విజయ్ యాదవ్, రంజిత్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు ఇంతకాలం జగన్ కోసం పని చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు నాలుగు రోజుల ముందుగా రంజిత్ కుమార్ రెడ్డి, విజయ్ యాదవ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు నందమూరి రామకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైసీపీ నాయకులు అందరికి తెలుగుదేశం కండువాలు కప్పిన నందమూరి రామకృష్ణ వారిని టీడీపీలో ఆహ్వానించారు. ఇద్దరు నాయకులు టీడీపీలో చేరుతున్న సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి జెండాలు వేరు అయినా అజెండా మాత్రం ఒక్కటే అని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల కష్టాలు తీర్చడానికి మూడు పార్టీల నాయకులు ఒక్కటి అయ్యారని, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
రంజిత్ కుమార్ రెడ్డి, విజయ్ యాదవ్ తో పాటు వారి బంధువులు, వందలాది మంది అనుచరులు తెలుగుదేశంలో చేరడంతో కూటమికి మరింత బలం వచ్చిందని నందమూరి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నందమూరి రామకృష్ణతో కలిసి అందరూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరడానికి సిద్దంగా ఉన్నారని నందమూరి రామకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications