చిరంజీవి..వైసీపీ మధ్య బంధం పెరుగుతోందా.!! పవన్ ను దెబ్బతీసేందుకు కొత్త స్కెచ్:..!ఏం జరగుతోంది..!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ రాజకీయాలు అంతు చిక్కటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబుకే మైండ్ బ్లాక్ అయ్యేలా సోషల్ ఇంజనీరింగ్.. పోల్ మేనేజ్ మెంట్ చేసిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సైతం అదే రకంగా వ్యవహరిస్తోంది. టీడీపీ బలం కోల్పోతుందని నమ్ముతున్న వైసీపీ..అదే సమయంలో బీజేపీ ఏపీలో అంత త్వరగా పుంజుకోలేదనే భావనతో ఉంది. దీంతో.. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించే ఏపీ రాజకీయాల్లో మరో సారి వాటి ఆధారంగానే ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు.

బంధం మరింత బలోపేతం అయినట్లు

బంధం మరింత బలోపేతం అయినట్లు

కొద్ది రోజులుగా రాజకీయాలు గమనిస్తే.. చంద్రబాబు అండ్ కో..పవన్ కళ్యాణ్ తిరిగి దగ్గరయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తోంది. దీంతో..వ్యూహాత్మకంగా చిరంజీవితో రాజకీయ సంబంధాలు నేరుగా కాకపోయినా.. ఆయన వర్గం..మద్దతు దారుల్లో ఇమేజ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. సైరా సినిమా వేదికగా ఈ బంధం మరింత బలోపేతం అయినట్లు కనిపిస్తోంది. చిరంజీవి తాజాగా తాడేపల్లి గూడెంలో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం వైసీపీ కాపు నేతల ఆధ్వర్యంలోనే జరిగింది. వారిని చిరంజీవి సైతం అభింనదనలలో ముంచెత్తారు. ఇదంతా..పవన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వైసీపీ ఎంచుకున్న కొత్త వ్యూహమా అనే చర్చ మొదలైంది.

చిరంజీవితో వైసీపీ కొత్త బంధాలు..

చిరంజీవితో వైసీపీ కొత్త బంధాలు..

రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితం అయిన మెగాస్టార్ చిరంజీవితో వైసీపీ పరోక్ష సంబంధాలు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే తాజాగా సైరా సినిమా కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సైరా సినిమా ప్రమోషన్ అనుమతులను చిత్ర నిర్మాతలు సీఎం జగన్ సొంత మీడియాకు అప్పగించారు. అదే విధంగా సాహో సినిమాకు ఏపీలో స్పెషల షోలకు అనమతి ఇవ్వని ఏపీ ప్రభుత్వం..తాజాగా సైరా సినిమాకు మాత్రం అర్దరాత్రి నుండి తెల్లారి 10 గంటలకు వరకు ఏకంగా ఆరు షోలకు చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది. దీనికి కొణిదెల యూనిట్ ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా..ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ పరోక్షంగా ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి పాజిటివ్ గా మారుతుందని అంచనా వేసింది.

ఎస్వీఆర్ విగ్రహానికి అనుమతులు..

ఎస్వీఆర్ విగ్రహానికి అనుమతులు..

ఇక, ఎంతో కాలంగా తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ చిరంజీవితో చేయించాలని చాలా రోజులు గా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అక్కడ ప్రభుత్వం పరంగా రావాల్సిన అనుమతులు అన్నీ పూర్తయితేనే తాను రాగలుగుతానని చిరంజీవి చెప్పుకొచ్చారు. దానికి అనుగుణంగానే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అనుమతులను క్లియర్ చేయించారు. అదే విధంగా చిరంజీవి సైరా సినిమాతో బీజీగా ఉన్నా..ఆయన వచ్చి విగ్రహావిష్కరణ చేసే దాకా ఎదురు చూసారు. ఇక, చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటనలో వైసీపీ నేతలు చాలా క్లోజ్ గా చిరంజీవితో ఉండటం రాజకీయంగా చర్చకు కారణమైంది. ఆయన సైతం వైసీపీ నేతలను అభినందనలతో ముంచెత్తారు. అయితే, ఆ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే..కాంగ్రెస్..బీజేపీ నేతలు ఉన్నారు. వైసీపీ నేతలు ప్రముఖ పాత్ర పోషించారు. కానీ, ఎక్కడా జనసేన నేతలు మాత్రం కనిపించలేదు.

చిరంజీవి మీద తాజాగా టీడీపీ నేతలు సైతం..

చిరంజీవి మీద తాజాగా టీడీపీ నేతలు సైతం..

అధికారంలో ఉన్న సమయంలో ఫెద్దగా చిరంజీవి గురించి స్పందించని టీడీపీ అధినాయకత్వం ఎన్నికల్లో ఓడిన తరువాత చిరంజీవి పైన ఆసక్తి చూపిస్తోంది. ఆగస్టులో చిరంజీవి జన్మదినాన టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పగా..మాజీ మంత్రి లోకేశ్ ఒక అడుగు ముందకేసి ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక, సైరా సినిమా సందర్బంగానూ లోకేశ్ ఇదే తరహాలో చిరంజీవికి అభినందలు చెప్పుకొచ్చారు. ట్వీట్ ద్వారా అభినందనలు చెప్పిన లోకేశ్ ఎన్నడూ లేని విధంగా చిరంజీవి సినీ హీరోగా ప్రదర్శించిన సామర్ధ్యాన్ని ప్రశంసించారు. ఇది సైతం రాజకీయంగా కొత్త కోణంలో చర్చకు కారణమైంది. సొంత పార్టీలోనే దీని పైన చర్చ సాగింది.

పవన్ బలాన్ని తగ్గించాలంటే..వైసీపీ ఇలా..

పవన్ బలాన్ని తగ్గించాలంటే..వైసీపీ ఇలా..

చిరంజీవి రాజకీయాలకు దూరమైనా.. ఆయన మీద సినీ అభిమానం మాత్రం చెక్కు చెదర్లేదని వైసీపీ నేతల అంచనా. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో పట్టు సాధించి..స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందిన వైసీపీ అదే పట్టు కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగానే అక్కడి నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. చిరంజీవి రాజకీయాల్లో లేరు కాబట్టి..ఆయనతో సఖ్యతగా ఉన్న సంకేతాలు ఇవ్వటం ద్వారా మెగా అభిమానుల మద్దతు పొంది..పరోక్షంగా పవన్ కళ్యాన్ ను దెబ్బ తీయవచ్చనేది వీరి అంచనాగా చెబుతున్నారు. అయితే.. మరి కొద్ది రోజులుగా చిరంజీవి అంశాల్లో సానుకూలంగా..దగ్గరగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు ఇది రాజకీయంగా ఏ మేర ప్రయోజనం కలిగిస్తుందనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+