పవన్, పురందేశ్వరి పై రోజా సంచలన వ్యాఖ్యలు..!!
వైసీపీ నేత రోజా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీం చేసిన వ్యాఖ్యల పైన పురందేశ్వరి స్పందన పైన మండిపడ్డారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను రోజా టార్గెట్ చేసారు. ఇది సినిమా షూటింగ్ కాదని..పవన్ కుటుంబ సభ్యులు గతంలో దేవుడి మీద నమ్మకం లేదని చెప్పిన మాటలను గుర్తు చేసారు. టీటీడీ ఈవోను లడ్డూ విషయంలో విచారించాలని డిమాండ్ చేసారు.
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. పురందేశ్వరి చేసిన ట్వీట్ పైన వైసీపీ నేతలు సాయిరెడ్డి, రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు. పురందేశ్వరి బావ కళ్లల్లో ఆనందం కోసమే కోర్టుల ను తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి బీజేపీ,టీడీపీలో ఏ పార్టీకి అధ్యక్షురాలని రోజా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మండి మనోభావాలు దెబ్బ తిన్నాయని రోజా మండిపడ్డారు.

లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో విచారణకు సిద్ద కావాలని..సీబీఐ విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేసారు. పవన్ కల్యాణ్ ఇది సినిమా షూటింగ్ కాదని గుర్తించాలన్నారు. విచారణ చేసి తప్పు జరిగి ఉంటే చేసిన వాళ్లను..లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడిన వారిని శిక్షించాలని కోరారు. పవన్ రోజుకో వేషం.. రోజుకో మాట సరికాదన్నారు. పవన్ చేసిన తప్పులకు భగవంతుడు ఆయనతోనే ప్రాయశ్చిత్త దీక్ష చేయిస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. భగవంతుడు లేడని పవన్ కుటుంబ సభ్యులు చెప్పారని..ఇప్పుడు వీరి తీరును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరద్దం.. కోర్ట్ ధిక్కారంగా పేర్కొన్నారు. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని విజయ సాయిరెడ్డి డిమాండు చేశారు.












Click it and Unblock the Notifications