జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూస్తున్న వైసీపీ లీడర్స్, సేమ్ డైలాగ్ లు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు వైసీపీ నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇప్పుడు వైసీపీ నాయకులు పోలీసుల ముందు విచారణకు హాజరు అవుతున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో చాలా రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ పోలీసుల ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు, మరిచిపోయాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలోని డైలాగులు చెప్పిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పిన డైలాగ్ లనే ఇప్పుడు మిగిలిన వైసీపీ నాయకులు పోలీసులకు చెప్పారని తెలిసింది.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే, వైసీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు 48 గంటల్లో పాస్ పోర్టులు పోలీసులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మంగళగిరి పోలీసులు వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.

శనివారం వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనారు. తరువాత వైసీపీ నాయకులు వారి పాస్ పోర్టులను మంగళగిరి పోలీసు అధికారులకు అప్పగించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి ఇదే సందర్బంలో పోలీసు అధికారులు వైసీపీ నాయకులను ప్రశ్నించారని తెలిసింది.

ఆ సందర్బంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిదని తమకు తెలుసు అని, అయితే ఆ దాడిలో మేము ప్రత్యక్షంగా పాల్గొనలేదని, ఆ సంఘటన గురించి మాకు ఏమీ తెలీదని, మాకు గుర్తు కూడాలేదని వైసీపీ నాయకులు పోలీసు అధికారులకు చెప్పారని తెలిసింది. అయితే అడిగిన ప్రశ్నలకు వైసీపీ నాయకులు అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు తెలీదు, గుర్తులేదు అని చెప్పడంతో ఏం చెయ్యాలో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారని తెలిసింది. మొత్తం మీద వైసీపీ నాయకుల నోట జూనీయర్ ఎన్టీఆర్ సినిమా డైలాగులు రావడంతో మంగళగిరి పోలీసులు నవ్వుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications