అక్కడ వాళ్ళు రెచ్చగొడితేనే దాడులు: సిట్ నివేదిక వేళ డీజీపీతో వైసీపీనేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ నాడు, పోలింగ్ తరువాత జరిగినటువంటి అనేక హింసాత్మక ఘటనలు నేటికీ ఏపీ వ్యాప్తంగా అన్ని వర్గాలలోను చర్చనీయాంశంగా మారాయి. దాడులకు వైసీపీనే కారణం అని కూటమి నేతలు, దాడుల వెనుక ఉంది కూటమి నేతలేనని వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
డీజీపీకి ఏపీ హింసపై సిట్ ప్రాధమిక నివేదిక
ఇక ఏపీలో దాడులపై నిఘా వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని దాడులు చెలరేగే అవకాశం ఉందని ఎన్నికల ఫలితాలు తర్వాత ఏపీలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతాయని ఇంటిలిజెన్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఎస్పీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ రెండు రోజుల దర్యాప్తును పూర్తి చేసి ప్రాథమిక నివేదికను రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాకు అందజేసింది.

ఏపీలో దాడులకు కారణం వారే: వైసీపీ నేతల కంప్లయింట్
అయితే ఏపీలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో సిట్ విచారణ తర్వాత వైసిపి నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్, అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, రావెల కిషోర్ బాబు తదితరులు డిజిపి హరీష్ కుమార్ గుప్తాను కలిసి ఏపీలో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు టిడిపి జనసేన బిజెపి కూటమి నేతలే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిజిపి కి విజ్ఞప్తి చేశారు.
హింసను ప్రేరేపించింది కూటమి నేతలే
కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని వైసిపి నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకనే కూటమి నేతలు హింసను ప్రేరేపించారని వారు మండిపడ్డారు. బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చారని, అందువల్లనే అధికారులు బదిలీ అయ్యారని వారు ఆరోపించారు.
అధికారులను మార్చిన చోటే అల్లర్లు
రాష్ట్రంలో ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయని వైసీపీ నేతలు పేర్కొన్నారు. టిడిపి కూటమినేతలు కొన్ని మూకలను ప్రేరేపించారని, ఫలితంగా అల్లర్లు చెలరేగాయని డీజీపీకి వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో హింసను ప్రోత్సహించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంతకు ముందు కూడా డీజీపీకి ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications