వైసీపీలోకి వంగవీటి రాధా - సీటు ఖరారు..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య నేతల పార్టీ మార్పు వేగం పెరిగింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు తాజాగా తెలుగుదేశం సీటు కేటాయించలేదు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్న రాధాతో వైసీపీ నేతలు మంత్రాంగం ప్రారంభించారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సీటు ఆఫర్ చేసారు. రాధా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాధా అడుగులు ఎటు: వంగవీటి రాధా రాజకీయ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది. 2019 ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ ఆశించిన రాధా పార్టీ వీడారు. ఆ ఎన్నికల్లో సెంట్రల్ సీటు వైసీపీ మల్లాది విష్ణుకు కేటాయించింది. దీంత, రాధా టీడీపీలో చేరారు. అప్పుడే రాధాకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ, పదవి దక్కలేదు.

YCP leadership invites Vangaveeti Radha in to the party offers Loksabha seat

రాధా అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. జనసేన నుంచి మధ్యలో ఆఫర్లు వచ్చాయి. రాధా జనసేనలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది. ఇక, తాజాగా టీడీపీ -జనసేన ప్రకటించిన అభ్యర్దుల జాబితాలో రాధా పేరు లేదు. విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తే పోటీ చేయాలని రాధా భావించారు.

వైసీపీ ఎంపీ సీటు ఆఫర్: విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఒక సమయంలో బోండా ఉమ- రాధా మద్దతు దారుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. లోకేష్ యువగళం సమయంలోనూ రాధా పాల్గొన్నారు. రాధాకు సీటు రాక పోవటంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. రాధాతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని, పేర్ని నాని తాజాగా రాధాతో మంతనాలు జరిపారు.

వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి విజయవాడ మూడు నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేసారు. దీంతో, ఎంపీగా పోటీ చేయాలన వైసీపీ నేతలు ప్రతిపాదించారు.

YCP leadership invites Vangaveeti Radha in to the party offers Loksabha seat

రాధా రీ ఎంట్రీ ఇస్తారా: రాధా వైసీపీలోకి రీ ఎంట్రీ పైన ఆలోచన చేస్తున్నారని..త్వరలోనే నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. వంగవీటి రాధా వైసీపీలో రీ ఎంట్రీ పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. రంగా వైసీపీలో చేరితే మచిలీపట్నం ఎంపీగా పోటీ పైన ప్రతిపాదన రాగా... ఎమ్మెల్యేగా పోటీ పైన ఆసక్తితో ఉన్నారని చెబుతున్నారు.

దీని పైన తన అనుచర వర్గంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని రాధా చెప్పారని సమాచారం. దీంతో, రాధా తిరిగి వైసీపీలోకి వస్తారా.. ఎంపీగా పోటీ చేస్తారా.. రాధా రీ ఎంట్రీ ఇస్తే విజయవాడ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+