స్పీకర్‌పై అవిశ్వాసం ప్రతిపాదన యోచనలో వైయస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
సస్పెన్షన్‌ను ఎత్తేయడానికి అధికార టిడిపి ససేమిరా అనడంతో వైసిపి శాసనసభా సమావేశాలను బహిష్కరించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తమకు సభలో మాట్లాడే అవకాశం తిరిగి వస్తుందనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
తమకు తగిన బలం లేకపోవడం వల్లనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఇంతకు ముందు జగన్ అన్నారు. కానీ, మనసు మార్చుకుని ఆయన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు మొగ్గుచూపినట్లు చెబుతున్నారు.

కాల్ మనీపై కూడా చర్చ పూర్తి కాలేదని వైయస్ జగన్ అభిప్రాయపడుతున్నారు. అయితే, కాల్ మనీపై చర్చ ముగిసిందని అధికార టిడిపి వాదిస్తోంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
రోజా సస్పెన్షన్‌పై శాసనసమండలిలోనూ వైసి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తాము సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications